YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 కౌలు రైతులకు ఆసరాగా….

 కౌలు రైతులకు ఆసరాగా….

 కౌలు రైతులకు ఆసరాగా….
తాడేపల్లి జనవరి 01
ఇంతవరకు భారతదేశ చరిత్రలో లేనట్లుగా రాష్ట్ర బడ్జెట్  2,27,974 కోట్ల రూపాయలైతే దాంట్లో వ్యవసాయానికి కేటాయించింది 28,866 కోట్లు.టోటల్ బడ్జెట్ లో వ్యవసాయానికి 12.66 శాతం గా ఉంది.దేశంలో ఏ రాష్ట్ర బడ్జెట్ లోను డబల్ డిజిట్ లో కేటాయింపులు లేవని రాష్ట్ర వ్యవసాయమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి  అన్నారు. బుధవారం అయన మీడీయాతో మాట్లాడారు. మా మేనిఫెస్టో హామీ,ప్రజల కోరిక తో  వ్యవసాయానికి ఉచితవిద్యుత్ 9 గంటలు ఇవ్వమని కోరినదానిపై కేవలం 60 శాతం ఫీడర్లలో మాత్రమే 9 గంటల పనిచేసే పరిస్దితిలో ఉన్నాయి.మిగిలిన ఫీడర్లు పనిచేయించాలంటే 1700కోట్లు వాటికి ఖర్చుపెట్టాల్సి ఉంది.అది కూడా బడ్జెట్ లోనే కేటాయించారు.దానితో కలిపితే  30,566 కోట్లు అంటే 13.4 శాతం వ్యవసాయానికి,రైతు సంక్షేమానికి కేటాయించడం జరిగింది.   గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో 2014–15 లో 13,110 కోట్లు 2015–2016 లో 14,184 కోట్లు,2016–2017 లో 16,250 కోట్లు,2017–2018 లో 18,214 కోట్లు, 2018–2019 లో 19,070 కోట్లు కేటాయించారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 28,866 వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులతో గత ప్రభుత్వం కంటే  9,796 కోట్లు అధికంగా కేటాయించారు.కేటాయింపులు ఉంటేనే రైతులకు పనిచేయించగలగుతాం.రైతులపట్ల చిత్తశుధ్ది అనేది ఇక్కడనుంచే మొదలైంది.  వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ,వ్యవసాయట్రాక్టర్లకు రోడ్డు టాక్స్ రద్దు చేయమని పాదయాత్రలో అడిగారు.అది రద్దు చేశారు.ఉచిత పంటల భీమా ఇప్పటివరకు రైతులు,కేంద్రం,రాష్ట్రం కలసి కట్టేవారు.ఫస్ట్ టైమ్ 2,164 కోట్లు భీమా చెల్లించి 55 లక్షల రైతు కుటుంబాల తరపున 56 లక్షల హెక్టార్ల భూమికి ఇన్సూరెన్స్ పేచేయడం జరిగింది.  ఉచిత పశుభీమా అమలుచేయడం జరిగింది.వైయస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్. ఇది ఒక ప్రెస్టేజ్ గా జగన్ గారు 2017 ప్లీనరీలో అనౌన్స్ చేయడం జరిగింది.ఫస్ట్ ఏడాదినుంచే 2020 మే నెల నుంచి అమలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పాం.కాని ఇంకా ముందుకే వచ్చి 12,500 ను వేయిరూపాయలు పెంచి అమలు చేయడం జరిగింది. ఇప్పటికి రైతు భరోసా కింద 5,350 కోట్లు రైతులకు చెల్లించాం.సంక్రాంతి కానుకగా వ్యవసాయమిషన్ సభ్యులు ఇచ్చిన సూచన మేరకు,ప్రభుత్వనిర్ణయం మేరకు  950 కోట్లు పే మెంట్ జరగబోతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గాని,పక్కన ఉన్న తెలంగాణాలో కాని కౌలురైతులకు చెల్లించలేదు.ఈ ప్రభుత్వం కౌలు రైతులకు 181 కోట్లు మొన్నటి ఇన్ స్టాల్ మెంట్ చెల్లించింది.మళ్లీ షుమారుగా 30 కోట్లు చెల్లించబోతోంది.ఆంధ్రప్రదేశ్ పంటసాగుదారు హక్కుల చట్టం అసెంబ్లీలో తీసుకురావడం జరిగింది. పాదయాత్రలో జగన్ గారిని కౌలు దారులు కలసి అనేక విజ్ఞప్తులు చేశారు.కౌలు విషయంలో పాతకౌలుదారి చట్టం అడ్డంకిగా ఉందని చెప్పి 1956,2011 కౌలుదారి చట్టాలను ఢినోటిఫై చేసి ఆంధ్రప్రదేశ్ పంటసాగుదారు హక్కుల చట్టంను తీసుకురావడం జరిగింది.
ఇప్పటికంటే అధికంగా కౌలురైతును ఈ చట్టం కిందకు తీసుకువచ్చేపనిచేయబోతున్నాం.ఈ చట్టం కాపీలను గ్రామసచివాలయాల ద్వారా భూయజమానులకు అందించబోతున్నాం.అవగాహన కల్పించబోతున్నాం.తద్వారా ప్రయోజనాలను కౌలురైతులకు చెల్లించే పరిస్దితి తేబోతున్నాం. ప్రధానమైన సమస్య రైతాంగం పాస్ బుక్ లవిషయంలోను రికార్డుల విషయంలోను వెబ్ ల్యాండ్ విషయంలోను,భూమి ఉన్నా రికార్డులలో లేకపోవడంతో సంఘర్షణకు లోనవుతున్నారు.  ప్రకాశం జిల్లాలో రైతు.ఎప్పుడో కొనుక్కున్న భూమి.తనపేరునే ఉంది. కాని రికార్డులలో వేరేవారిపేర్లకు మారిస్తే అది వారి పిల్లలకు రిజిష్టర్ చేసేస్తే ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తేనే జరిగిందని ఆత్మహత్య చేసుకున్న పరిస్దితి ఛూశాం.   ఇలాంటివి లేకుండా చేయాలని ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం 2019 తీసుకురావడం జరిగింది.దీనిద్వారాగా ప్రభుత్వమే మే నెలాఖరుదాకా ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు.మొత్తం ఏదున్నా రికార్డులు ప్యూరిఫై అయిపోవాలి.చనిపోయినవ్యక్తులపేరుపై ఉన్న భూములు కాని,అనేక అంశాలలో ఉన్న భూములు అన్నీ కూడా భూమి వారి పేర్లతో రికార్డు మారాలి.ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమని అన్నారు. ఈ ఏడాది తీసుకుంటే వైయస్సార్ భీమా.ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఐదులక్షలరూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినా కూడా అది పెంచి ఏడులక్షలు అందచేయడం జరుగుతుంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వ కాలంలో 546 మంది రైతులు చనిపోతే వారు రైతులు కాదని చెబితే వారిని సైతం  రైతుల జాబితాలో చేర్చమని సిఎం జగన్గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ఇచ్చేందుకు వీలుగా కోటిరూపాయలు అందుబాటులోకి ఉంచుకుని వారికి వెంటనే అందచేసే ఏర్పాటుచేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. శనగ రైతులకు 330 కోట్లు అంటే గత మూడు నాలుగు సంవత్సరాలుగా అమ్ముకోలేని పరిస్దితిలో పంటలను నిల్వబెట్టుకుని,కరవు మూలంగా  దిగుబడులు తగ్గిపోయి కూడా ధరలుఅమ్ముకోలేనిపరిస్దితిలో ఈ కేటాయింపులు జరిగాయి. మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ధరలస్దిరీకరణ అని మూడువేల కోట్లతో జగన్ గారు ప్రకటించారు.ఆ తర్వాత చంద్రబాబు నేను ఐదువేల కోట్లు అని ప్రకటించారు.50 కోట్లు కూడా కేటాయింపులు చేయలేదు.ఇంటీరియమ్ బడ్జెట్ లో మాత్రం 500 కోట్లు చూపారు.ఖర్చుచేయలేదు.  వైయస్ జగన్  వచ్చాక మూడువేలకోట్ల రూపాయలు ధరలస్దిరీకరణ ని«ధికి కేటాయించడమే కాదు ఈరోజు మార్కెట్ లో ప్రోక్యూర్ మెంట్ విషయంలో ధాన్యం,కాటన్ సిసిఐ ద్వారా కావచ్చు నాలుగురోజులలోపే పేమెంట్ చేయడం జరుగుతుంది.అలాగే గ్రౌండ్ నెట్ సెంటర్లు.  మార్కెట్ కు పంట వచ్చే సమయానికే ప్రోక్యూర్ మెంట్ ఉండాలనేది దీనినుంచే తీసుకున్నాం.అలాగే 2 వేల కోట్లతో ప్రకృతి వైపరిత్యాల నిధి.ఇన్ పుట్ సబ్సిడీని 15 శాతం పెంచారు.పంట రుణాలన్నీ కూడా వడ్డీలేని పంటరుణాలు.నెక్ట్స్ మార్చి తర్వాత పేమెంట్ జరుగుతుంది కాబట్టి మార్చి తర్వాత వారికి వచ్చే ఛాన్స్ ఉంటుందని అయన అన్నారు. 

Related Posts