YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చంద్రబాన్ 3 కి ప్రభుత్వ ఆమోదం

చంద్రబాన్ 3 కి ప్రభుత్వ ఆమోదం

చంద్రబాన్ 3 కి ప్రభుత్వ ఆమోదం
బెంగళూరు జనవరి 1 , 
చంద్రయాన్-3 ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం దక్కిందని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. బుధవారం  ఆయన బెంగుళూరులో మీడియాతో మాట్లాడారు.   చంద్రయాన్-3 ప్రాజెక్టు ప్రక్రియ కొనసాగుతోందన్నారు.  రెండవ అంతరిక్ష కేంద్రం కోసం భూసేకరణ జరుగుతోందని, తమిళనాడులోని తూత్తుకుడిలో స్పేస్పోర్ట్ ఉంటుందని శివన్ చెప్పారు. చంద్రయాన్-2తో ఎంతో మంచి ప్రగతి సాధించామన్నారు. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై దిగలేకపోయినా.. ఆర్బిటార్ మాత్రం చురుగ్గా పనిచేస్తున్నదన్నారు.  చంద్రుడి డేటాను మరో ఏడేళ్ల పాటు ఆ ఆర్బిటార్ అందివ్వనున్నట్లు ఇస్రో చీఫ్ తెలిపారు. ఈ ఏడాది గగన్యాన్ ప్రాజెక్టును కూడా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇస్రో చేపట్టబోయే ప్రాజెక్టులను ఆయన వివరించారు. గగన్యాన్ ప్రాజెక్టు కోసం వ్యోమగాముల ఎంపిక పూర్తి అయ్యిందని, భారత వైమానిక దళం నుంచి నలుగుర్ని ఎంపికయ్యారని, వారంతా రష్యాలో జనవరి మూడవ వారం నుంచి శిక్షణ తీసుకోనున్నట్లు చెప్పారు. శ్రీహరికోటలో పబ్లిక్ వ్యూవింగ్ గ్యాలరీని ఏర్పాటు చేశామన్నారు.

Related Posts