YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కొత్త మున్సిపల్‌ చట్టం సమర్థంగా అమలు చేస్తాం: కేటీఆర్‌

కొత్త మున్సిపల్‌ చట్టం సమర్థంగా అమలు చేస్తాం: కేటీఆర్‌

కొత్త మున్సిపల్‌ చట్టం సమర్థంగా అమలు చేస్తాం: కేటీఆర్‌
హైదరాబాద్‌ జనవరి 1  :
కొత్త మున్సిపల్‌ చట్టం సమర్థంగా అమలు చేయడమే తమ ముందున్న లక్ష్యమని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మంత్రి కేటీఆర్‌ చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2019 తమకు బ్రహ్మండమైన ఆరంభం ఇచ్చిందన్నారు. 2020 కూడా మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయంతో శుభారంభం చేస్తామని తెలిపారు. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారన్నారు. కొత్త దశకంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా ఎదుగుతుందన్నారు. ఈ నెల మొదటివారంలో కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ సమావేశం ఉంటుందని తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికలకు పార్టీ సమాయత్తంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు చెప్పారు. చట్టం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కౌన్సిలర్‌పై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 2020-30 దశకం టీఆర్‌ఎస్‌ నేతృత్వంలోని తెలంగాణ రాష్ర్టానిదేనన్నారు. ఈ ఏడాది తాను సీఎం అవుతానన్న చర్చే అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా అసెంబ్లీలోనే ఈ విషయం చెప్పారు. దానికి తిరుగులేదని కేటీఆర్‌ అన్నారు

Related Posts