ఆర్టీసీ సంబరాలు
విశాఖపట్నం జనవరి 1 :
నూతన ఏడాదిలో ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది ఏపీ ప్రభుత్వం.ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగనున్నారు. ఆర్టీసీ విలీనంపై విశాఖలో ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. మద్దిలపాలేం సమీపంలో ఉద్యోగులంతా కలసి సిఎం జగన్ కు అభినందనలు తెలియచేస్తూ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్న అవంతి శ్రీనివాస్ రావు కేక్ ను కట్ చేసి ఆర్టీసీ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా వైఎస్ చిత్రపఠానికి పూల మాలవేసి నివాళి అర్పించారు.దేశ చరిత్రలోనే ఆర్టీసీ విలీనం చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు అన్నారు.జగన్ విలీనం నిర్ణయంతో 55 వేల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిస్తోందని చెప్పారు.పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేసిన ఘనత జగన్ కే దక్కుతుందని చెప్పారు.ఈ సందర్బంగా మంత్రి అవంతి శ్రీనివాస్ రావు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఇంటికి చేరుకున్నారు.