YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అనాధలకు,వృద్ధులకు, పేదలకు చేయూతనివ్వడం అభినందనీయం

అనాధలకు,వృద్ధులకు, పేదలకు చేయూతనివ్వడం అభినందనీయం

అనాధలకు,వృద్ధులకు, పేదలకు చేయూతనివ్వడం అభినందనీయం
నెల్లూరు జనవరి 1  
అనాధలకు, వృద్ధులకు, పేదలకు చేయూతనివ్వడమే లక్ష్యంగా సిహెచ్ ఎన్ కె చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మూడవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎస్. వెంకట కవిత పేర్కొన్నారు. స్థానిక పలుకూరు రోడ్డు, లేక్ వ్యూ కాలనీ 9వ వీధి మెయిన్ రోడ్ నందు బుధవారం చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సివిల్ జడ్జి వెంకట కవిత మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర హైరర్స్ అండ్ టూల్స్ అధినేత సిహెచ్. నరసింహులు వృత్తిరీత్యా గ్రామాలలో తిరుగుతున్న ఆయా సందర్భాలలో ఆయనకు ఎదురైన పరిస్థితులకు , స్థితిగతులకు ఆకర్షితుడై సిహెచ్ హెచ్ ఎన్ కే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తన వంతుగా వృద్ధులకు , అనాధలకు, పేద ప్రజలకు  చేయూతనివ్వడం మానవతా దృక్పథం అన్నారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు అలవర్చుకొని, సమాజంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ట్రస్టు స్థాపించి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పేదలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషదాయకం అన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ నరసింహులు మాట్లాడుతూ అనాధలు, వృద్ధులు, పేద కుటుంబాలకు చెందిన వ్యక్తులు మరణించినప్పుడు అవసరమైన హైరర్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక స్తోమత లేని కొన్ని కుటుంబాలకు చెందిన సభ్యుల స్థితిగతులను కళ్ళారా చూసిన సందర్భాలకు స్పందించి ఆవిర్భవించినదే సిహెచ్ హెచ్ ఎన్ కె చారిటబుల్ ట్రస్ట్ అని తెలిపారు. ఈ ట్రస్ట్ జనవరి 1వ తేదీ  2019 న ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఆనాటి నుంచి నెల్లూరు నగరానికి మూడు కిలోమీటర్ల లోపు అనేకమంది కుటుంబాల వారికి ఉచితంగా అవసరం మేరకు షామియానా, కుర్చీలు, టేబుల్స్ సమకూర్చడం జరిగిందన్నారు. అంతేకాకుండా  మెడికల్ క్యాంపులు వేసవికాలంలో చలివేంద్రాలు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు సి హెచ్ ఎన్ కె చారిటబుల్ ట్రస్ట్ గురించి మరింత మందికి తెలియజేసి ట్రస్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ నాగరాజు యాదవ్, పి వి ప్రసాద్ , శ్రీ వైభవ్ మరియు ట్రస్ట్ కార్యదర్శి కె. శివ  కుమార్, కోశాధికారి  టి. పవన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts