YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీలకు, పారిశుద్ధ్య కార్మికులకు వస్త్ర దానం

ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీలకు, పారిశుద్ధ్య కార్మికులకు వస్త్ర దానం

ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీలకు, పారిశుద్ధ్య కార్మికులకు వస్త్ర దానం
 నెల్లూరు జనవరి 1  (br /> హంగులు ఆర్భాటాలకు దూరంగా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  నూతన సంవత్సర వేడుకలు కార్యక్రమాన్ని సేవా కార్యక్రమం గా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో ప్రసూతి కేంద్రం నందు గర్భిణీ స్త్రీలకు మరియు పారిశుద్ధ్య మహిళా కార్మికులకు నూతన సంవత్సరం సందర్భంగా కొత్త అధ్యాయానికి స్వాగతం పలుకుతూ నూతన వస్త్రాలను, స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన పిలుపు మేరకు, ఆదేశాలను పాటిస్తూ నెల్లూరు రూరల్ వైకాపా మహిళా నాయకురాళ్లు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. అనాధలకు, పేదలకు, వృద్ధులకు చేయూతనిచ్చిన వారికి దేవుడు సమృద్ధిగా అభివృద్ధి సంక్షేమం సాధించే దిశగా సానుకూలత తప్పకుండా చూపిస్తాడని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చలికాలంలో దుప్పట్లు , వానాకాలం లో గొడుగు లు, ఎండాకాలంలో చెప్పులు దానం చేసిన వారికి ఆ దేవాది దేవుని ఆశీస్సులు మెండుగా ఉంటాయని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో జరుగు వివిధ శుభకార్యాల్లో సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు గ్రామీణ నియోజవర్గ మహిళా నాయకురాళ్లు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts