YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

అన్నీ ఉన్నాయ్... కానీ..!! (అనంతపురం)

అన్నీ ఉన్నాయ్... కానీ..!! (అనంతపురం)

అన్నీ ఉన్నాయ్... కానీ..!! (అనంతపురం)
అనంతపురం, జనవరి 02 జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల మరమ్మతుల్లో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. ఏ పరికరం చెడిపోయినా మరమ్మతు చేయించడం లేదు. ఇప్పటికే చిన్నాచితక పరికరాలు వందల కొద్దీ మూలన పడ్డాయి. రోగుల వైద్య చికిత్స కోసం నిత్యం ఉపయోగించే కీలక వైద్య పరికరాలు సైతం మరమ్మతుకు నోచుకోక అటకెక్కాయి. ఉన్నంతలోనే వైద్య చికిత్స మమ అనిపిస్తున్నారు. అటు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న టీబీఎస్‌ కంపెనీ మరమ్మతులు చేయలేదు. ఇటు ఆస్పత్రుల అధికారులు మరమ్మతు చేయించుకునే వీలులేదు. ఈక్రమంలో చిన్నదైన బీపీ అపరేట్‌ను కూడా మరమ్మతు చేయించుకోలేక పక్కన పడేస్తున్నారు. ఇప్పుడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇదే దుస్థితి. దీనికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించక పోవడంతో అధికారులకు సైతం ఏమీ పాలుపోకపోగా.. సామాన్యుడు చికిత్సలకు రోజంతా పడిగాపులు కాయడం లేదా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్త ప్రక్రియలో భాగంగా జిల్లాలో అన్ని రకాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న వైద్య పరికరాల మరమ్మతు బాధ్యతను టెలీమాటిక్‌ బయోమెడికల్‌ సర్వీసెస్‌ (టీబీఎస్‌) అనే కంపెనీకి అప్పగించారు. ప్రతి చిన్న పరికరానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇచ్చారు. మరమ్మతుకు గురైనా.. కొత్త విడిభాగాలు అమర్చాలన్నా సదరు కంపెనీనే చూసుకోవాలి. ఇందుకు ఏకమొత్తంగా ప్రభుత్వం తగిన బిల్లు చెల్లిస్తూ వచ్చింది. ఈమేరకు అనంతపురంలోని సర్వజన ఆస్పత్రి, హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి, కదిరి, గుంతకల్లు ప్రాంతీయ ఆస్పత్రులు, ధర్మవరం, తాడిపత్రి, మడకశిర, రాయదుర్గం, పెనుకొండ, గుత్తి, సీకేపల్లి, శింగనమల, నల్లమాడ, తనకల్లు, పామిడి.. వంటి సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), అన్ని పీహెచ్‌సీల్లో ఉన్న వైద్య పరికరాల మరమ్మతు బాధ్యతను అప్పగించారు. ఈ సంస్థకు ఇచ్చిన గడువు కూడా ముగిసినట్లు తెలుస్తోంది. గత ఐదారు నెలలుగా ఆసుపత్రుల్లో పరికరాల మరమ్మతుల ప్రక్రియ ఏమాత్రం కదలడం లేదు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎక్స్‌రే యంత్రం, రెండు అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌, మెయిన్‌ ఓటీ డూం లైట్లు, ఆర్థో, ఐసీసీయూ, ఏఎంసీ, ఎస్‌ఎన్‌సీయూ... వంటి కీలక విభాగాల్లో అనేక పరికరాలు పని చేయలేదు. ఇక శింగనమలలో ఎక్స్‌రే, తాడిపత్రిలో ఆటో క్లైవ్‌, కళ్యాణదుర్గంలో రిఫ్రిజిరేటర్‌, ధర్మవరంలో రెండు ఫోటోథెరఫీలు, నల్లమాడలో యాస్పిరేషన్‌, డి.హీరేహాళ్‌లో రేడియంట్‌ వార్మర్లు, ఉరవకొండ, రాయదుర్గం, మడకశిర, హిందూపురం, గుంతకల్లు, పెద్దవడుగూరు, కల్లుమర్రి, కనగానపల్లి.. వంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బీపీ ఆపరేట్లు కూడా పని చేయలేదు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంత దయనీయంగా ఉందో అవగతం అవుతోంది.

Related Posts