యువకులను చితకబాదిన పోలీసులు
- చర్యలకు ఐజీ ఆదేశం
సిరిసిల్ల జనవరి 02
సిరిసిల్లలో జరిగిన ఘటనపై ఘటనపై ఐజీ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుల్, హోంగార్డ్ను హెడ్ క్యార్టర్ కు అటాచ్ చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. కొత్త సంవత్సర వేడుకలు చేసుకుని తిరిగొస్తున్నయువకులపై పోలీసుల ప్రతాపం చూపించిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్లా జిల్లా పోలీసులు మద్యం సేవించిన ముగ్గురు యువకులను విచక్షణరహితంగా చితకబాదారు. చంద్రపేటలో న్యూఇయర్ వేడుకలు జరుపుకుని బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. పొడవాటి కర్రతో మత్తు దిగే దాకా చితకబాదారు. బూతులు తిడుతూ యువకులకు చుక్కలు చూపించారు. ఈ తతంగాన్ని కొందరు యువకులు అక్కడే ఉన్న బిల్డింగ్ పై నుంచి వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోను చూసిన నెటిజన్స్ పోలీసులపై మండిపడ్డారు. ఎంత తాగినా మరీ ఇంత దారుణంగా కొడతారా అంటూ విమర్శలు గుప్పించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఐజీ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుల్, హోంగార్డ్ను హెడ్క్వార్టర్కు అటాచ్ చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. దీంతో ఎస్పీ రాహుల్ హెగ్డే ఆ పోలీసులను హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేశారు.