YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 పాలమూరులో సీఎస్ పర్యటన

 పాలమూరులో సీఎస్ పర్యటన

 పాలమూరులో సీఎస్ పర్యటన
మహబూబ్ నగర్ జనవరి 02
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం గుండ్ల పొట్లపల్లి గ్రామంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గురువారం పర్యటించారు. అక్కడ జరిగిన  పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామ సభ కు హజరయ్యారు.. గ్రామంలో వీధులు.. వాడలు తిరుగుతూ పరిశుభ్రత పై తీసుకున్న చర్యలను పరిశీలించారు.  గ్రామస్తులతో మాట్లాడారు. సీఎం మాట్లాడుతూ పల్లె ప్రగతి ప్రారంభించాక ప్రతి గ్రామం అభివృద్ధి వైపు పయనిస్తోంది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. మొత్తం తెలంగాణ స్వచ్ఛ తెలంగాణ కావడం సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. ప్రతి నెల 339 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. పనుల ప్రర్యవేక్షణకు ఫ్లైయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశాం. ఈచ్ వన్ టీచ్ వన్ విజయవంతం చేయాలని అయన కొరారు. మనం అక్షరాస్యత లో కింది నుంచి నాల్గవ స్థానంలో ఉండటం మచ్చలా ఉంది. ఆరు నెలల తర్వాత రాష్ట్రంలో ఎవ్వరూ చదువు..రాత రాని వారు ఉండవద్దన్నది సీఎం కేసీఆర్ ఆశయమని అన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన గ్రామాలకు పురస్కారాలు ఇస్తామని అన్నారు.  తరువాత సీఎస్ ను గ్రామస్థులు అడ్డుకున్నారు. కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు నిరసన తెలిపారు.

Related Posts