YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా తెలంగాణ

మా సభలో రభస

మా సభలో రభస

మా సభలో రభస
హైదరాబాద్ జనవరి 2
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, సఖ్యత లేకపోవడం అన్నది ఇప్పటి విషయం కాదు. ఎప్పుడు 'మా' సమావేశం జరిగినా ఏదో ఒక వాడీవేడీ వివాదం ఉండడం పరిపాటిగా మారింది. ఈసారి కూడా అందుకు మినహాయింపు కాదు. తాజాగా, 'మా' డైరీ ఆవిష్కరణ సమావేశంలో తీవ్రస్థాయిలో రభస జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, జయసుధ, మోహన్ బాబు, రాజశేఖర్, పరుచూరి వెంకటేశ్వరరావు, టీ సుబ్బరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు.చిరంజీవి మాట్లాడుతూ  సినిమా అసోసియేషన్ ఓ కన్ స్ట్రక్టివ్ గా సాగిపోవాలని, ఏదైనా మంచి జరిగితే, పెద్దగా అరిచి చెప్పాలని, గొడవలు వస్తే, చెవిలో చెప్పుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. మాలో మూలధన నిధి పెరిగే కొద్దీ గొడవలు పెరుగుతున్నాయని ఎవరి పేరునూ చెప్పకుండా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. విభేదాలు వస్తే, బయట పడకుండా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. అనంతరం పరచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా ఆయన నుంచి మైక్ ను రాజశేఖర్ లాక్కోని మాట్లాడుతూ..  నిప్పును ఎంతగా దాచాలని ప్రయత్నించినా, పొగ రాకుండా మానదని అన్నారు. దాంతో వేదికపై రభస మొదలైంది. ఈ సమయంలో రాజశేఖర్ ను వారించే ప్రయత్నాన్ని చిరంజీవి చేశారు. మోహన్ బాబు కూడా రాజశేఖర్ ను వారించే ప్రయత్నం చేశారు.. దీంతో రాజశేఖర్ ఆయనపై కూడా ఫైర్ అయ్యారు. ‘వినండి. మీరు అరిచేస్తే ఏదీ జరిగిపోదు. నేను చెప్పేది మీరందరూ దయచేసి వినండి. ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో 18 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు ఉన్నారు. శ్రీకాంత్, శివాజీ రాజా ఉన్న సమయంలో ఏ సమస్య జరగలేదని చిరంజీవి అన్నారు. దాన్నే ప్రాబ్లమ్ గా తీసుకుని నరేశ్ ఇప్పుడు వచ్చి, వాళ్లు తప్పు చేశారని అంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఏదైనా ఇంతకుముందే అందరూ కలిసి మాట్లాడుకున్న తరువాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వుండాల్సిందని, తానేమీ చిన్న పిల్లాడిని కాదని, ఏ విషయాన్ని అయినా కప్పి పుచ్చాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తూ వేదిక దిగి వెళ్లిపోయారు… ఈ సంఘటనతో చిరంజీవి షాక్ గురయ్యారు.

Related Posts