YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రజలు సంయమనం పాటించాలి

ప్రజలు సంయమనం పాటించాలి

ప్రజలు సంయమనం పాటించాలి
విశాఖపట్నం జనవరి 2
అమరావతిలో చంద్రబాబు మరో డ్రామాకు తెరతీశారు.  నిన్నటి రోజున పెద్ద డ్రామా జరిగింది.  చంద్రబాబు, ఆయన భార్య సెలబ్రేషన్స్ కాదనుకుని,  అమరావతి రైతులతో ఆందోళన చేస్తామని వెళ్ళారు.  తన భార్య ఆలోచనలతో వచ్చానని చంద్రబాబు స్వయంగా చెప్పారు.  భువనేశ్వరి గారు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుందామని వచ్చి వుంటారు.  పనిలో పనిగా అమరావతి ఆందోళనలో పాల్గొన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు.  భువనేశ్వరీ గారు రెండు గాజులు కాదు. తీసుకున్న భూములు తిరిగి ఇచ్చేస్తే బాగుండేది.  చంద్రబాబును చూసి వైఎస్ రాజశేఖరరెడ్డి భయపడేవారని చంద్రబాబు చెప్పుకున్నారు.  చంద్రబాబును చూసి వైఎస్ఆర్ ఎందుకు భయపడతారు? - బహుశా చంద్రబాబు వికృతమైన ఆకారం చూసి భయపడితే భయపడి వుండవచ్చు.  చంద్రబాబు రాజకీయ చరిత్ర అందరికీ తెలిసిందే.  ఆయన రాజకీయంగా ఎదగడానికి, మంత్రి అవ్వడానికి  వైఎస్ రాజశేఖరరెడ్డి సహకరించారని అన్నారు.  ఇది వాస్తవం కాదా.. ఆత్మ పరిశీలన చేసుకో చంద్రబాబు.  ఎందుకు ఢాంబికాలు మాట్లాడుతున్నావని ప్రశ్నించారు.  కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో 5 ఏళ్లు చంద్రబాబు సీఎంగా వున్నారు.  రాష్ట్రంలోని పరిస్థితులను, అవసరాలను, అభివృద్దిని పరిగణలోకి తీసుకోలేదు.  అందువల్లే ఈరోజు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది.  ఈ రాష్ట్రంను మరో ఇరవై ఏళ్లు వెనుకకు తీసుకువెళ్లారు.   ఆర్థిక క్రమశిక్షణ లేకుండా, ఎఫ్ఆర్బిఎంను క్రాస్ అయ్యారు.  దానివల్ల నేడు అనేక ఇబ్బందులు పడుతున్నాం.  అసలు రాష్ట్ర విభజన జరగడానికి కారణం చంద్రబాబని ఆరోపించారు. అందరికంటే ముందే తెలుగుదేశం విభజనకు మద్దతు ఇచ్చింది.   ఆనాడు కేసిఆర్ ఆమరణదీక్ష చేస్తే,   అఖిలపక్ష సమావేశం పట్టి పార్టీల నిర్ణయాలు పంపమని కేంద్రం అడిగింది.  టిడిపి నుంచి అశోక గజపతిరాజు మొదట విభజన గురించి మాట్లాడారు.  రాష్ట్రంలో ఉత్తరాంధ్రజిల్లాలు కూడా అభివృద్ది చెందాలనే అందరి ఆలోచన.  రాజధానిపై రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలు చూసిన తరువాతే ఒక నిర్ణయం.   వికేంద్రీకరణ అంటే... 13 జిల్లాల్లోని భౌగోళిక, సామాజిక పరిస్థితులను సమీక్షించుకుని అభివృద్థి చేయాలి.  గత అయిదేళ్లలో ఇటువంటి అభివృద్ది గురించి ఎప్పుడైన చంద్రబాబు చెప్పారా?  అమరావతి గ్రాఫిక్స్ గురించి టివిల్లో ఊదరగొట్టారు.  ప్రాజెక్ట్ లు కట్టాలి... మరోవైపు విద్యా, వైద్యం, రహదారులు, పరిశ్రమలు, పోర్ట్ లు, ఎయిర్ పోర్ట్ లు రావాలి.  ఇవ్వన్నీ జరిగితేనే అభివృద్థి సాధ్యపడుతుంది.  గత ప్రభుత్వం వీటన్నింటినీ పక్కకు పెట్టిందని అన్నారు.  అమరావతిలో దీక్షలు చేస్తున్న దానికి ఒక ఎజెండా లేదు.  చంద్రబాబు చెప్పినది తప్ప మరేదీ చేయడానికి లేదని వారు అంటున్నారు.   పెయిడ్ ఆర్టీస్ట్ లు మంత్రి అనీల్ పై గతంలో ఎంత అసభ్యంగా మాట్లాడారో చూశాం.  సోషల్ మీడియాలో మా నాయకులపై ఇప్పుడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం.  అన్ని ప్రాంతాల వారు సంయమనం పాటించాలి.  అమరావతి రైతులకు ప్రభుత్వం భరోసా ఇస్తోంది... వారికి డెవపల్ మెంట్ ప్లాట్ లు ఇస్తాం.  గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వారి టౌన్ షిప్ ను అభివృద్ది చేసి ఇస్తాం  హైపర్ కమిటీ, బోస్టన్ నివేదిక వచ్చిన తరువాత సమగ్ర ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటాం.  హైటెక్ సిటి పేరుతో ఆనాడు అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారు.   అమరావతి పేరుతో మళ్లీ ఇక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారు.   ఇప్పుడు రాష్ట్రప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.   ఇది దోపిడీ విధానం.. కాదా చంద్రబాబు?  దేశం అంతటికి ఒక ఇండస్ట్రీయల్ పాలసీ వుంది.  ఏ కార్పోరేషన్ అయినా నష్టాల్లో వుంటే..  ఆ పాలసీ ప్రకారం డిజిన్వెస్ట్ మెంట్ చేస్తాయి.   కానీ ఎపిలో మాత్రం అలా జరగలేదు.  యాబై ఒక్క వేల మంది ఎపిఎస్ ఆర్టీసి కార్మికులకు  ఏడాదికి రూ.3400 కోట్లు జీతాలు చెల్లిస్తూ ప్రభుత్వంలో కలిపారు.  ఎపిలో కొత్త విధానంను సీఎం  వైఎస్ జగన్ తీసుకువచ్చారు.   ప్రజారవాణా సంస్థ అనేది ప్రజలకు సంబంధించినది.  దానిని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని మా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించింది.  దేశంలో ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమం జరిగిందా..? - మంచి చేస్తుంటే... చంద్రబాబు గగ్గోలు పెడున్నారు.  మనస్సు వుంటే... మార్గం వుంటుంది.  ఎంతసేపు దోచేద్దామని అనుకుంటే ఇలాగే వుంటుంది చంద్రబాబు.  ప్రభుత్వంకు కొన్ని విధానాలు వుంటాయి. దాని ప్రకారమే ముందుకు వెడుతుందని బోత్స అన్నారు. 

Related Posts