Highlights
- అంతర్జాతీయంగానూ భారమే..
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి.అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువ కావడంతో పసిడి ధర ఏడాది గరిష్ఠానికి చేరింది. శనివారం నాటి మార్కెట్లో రూ.85 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.31,835గా ఉంది.అటు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. రూ.50 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 39,600గా ఉంది.చైనాపై అమెరికా వాణిజ్య ఆంక్షలు పెట్టడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్న విషయం తెలిసిందే.దీంతో మదుపర్లు రక్షణాత్మక ధోరణిలో వ్యవహరిస్తూ బంగారంలో పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నారు.దీంతో ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయంగానూ బంగారం ధరలు పెరిగాయి
న్యూయార్క్‌లో శుక్రవారం నాటి మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.37శాతం పెరిగి 1,346.80డాలర్లు పలికింది.వెండి కూడా 1.13శాతం పెరిగి ఔన్సు ధర 16.53 డాలర్లుగా పలుకుతుంది.