YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పల్లె ప్రగతి ద్వారా గ్రామాల సమూల మార్పులు

పల్లె ప్రగతి ద్వారా గ్రామాల సమూల మార్పులు

పల్లె ప్రగతి ద్వారా గ్రామాల సమూల మార్పులు
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి జనవరి 2 
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో సమూల మార్పులు తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.       పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన వనపర్తి జిల్లా రేవల్లి మండలం చెన్నారం లో నిర్వహించిన గ్రామ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన సి సి రోడ్డు పనులకు, డంపింగ్ యార్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయతీ కి ట్రాక్టర్ ను అంద చేశారు.      అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన పల్లె ప్రగతి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్వహించిన కార్యక్రమాలన్నింటినీ రెండవ విడతలో కూడా చేపట్టడం జరుగుతుందని, ముఖ్యంగా గ్రామాలలో మురికి కాలువలు శుభ్రం చేయటం, చెత్తను డంపింగ్ యార్డ్ లకు చేరవేయాలని, హరితహారం కింద మొక్కలు నాటాలని, మహిళలు, యువకులు శ్రమదానం లో పాల్గొని గ్రామాన్ని శుభ్రంగా తీర్చిదిద్దాలని, మిషన్ భగీరథ కింద ఇంటింటికి తాగునీరు అందించడం జరుగుతుందని, అపరిశుభ్రత కారణంగా వివిధ రకాల జబ్బులు, విష జ్వరాలు వచ్చేందుకు అవకాశం ఉందని, ప్రజలు రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తామని, అలాగే ప్రతి కుటుంబంలో చదువుకున్నవారు ఉండాలని, రైతులు మనసుపెట్టి నూతన పద్ధతిలో వ్యవసాయం చేయాలని, వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారి కి డ్రోన్లు సరఫరా చేయటం, అంతేకాక వరి నారుమళ్లు వేసేందుకు యంత్ర పరికరాలను అందిస్తామని తెలిపారు. వనపర్తి జిల్లాలో ఆయిల్ పాముకు నేలలు అనువుగా ఉన్నందున రైతులు ఆయిల్ ఫామ్ పంట సాగు పై దృష్టి సారించాలని, అలాగే ఉద్యాన పంటలు సాగు చేయడం ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చని, మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు కూడా మారవలసిన అవసరం ఉందని మంత్రి అన్నారు. జిల్లాలో వేరుశెనగ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నది తమ అభిమతమని, దానిని ఎలాగైనా సాధించి తీరుతామని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు ఈచ్ వన్. టీచ్ వన్ నినాదంతో నిరక్షరాస్యులకు చదువు వచ్చిన వారు చదువు చెప్పాలని, ముందుగా నిరక్షరాస్యులను లెక్కించాలని మంత్రి కోరారు.    గ్రామ సర్పంచ్ రమేష్, డి ఆర్ డి ఓ గణేష్ లు మాట్లాడారు.        జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి. రేవల్లి ఎంపీపీ సేనాపతి, సింగిల్విండో అధ్యక్షుడు రఘుమారెడ్డి, ఎంపీటీ సి  విమలమ్మ, మాజీ మండల అధ్యక్షులు జానకి రామ్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ జగన్మోహన్, డి ఈ మెగా రెడ్డి, ఆర్డిఓ చంద్రారెడ్డి తాసిల్దార్, ఎంపీడీవో ఇతర శాఖల అధికారులు, డి ఐ ఓ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.       ఈ సందర్భంగా మంత్రి పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ప్రశ్నలు జవాబులు అడిగారు. అంతేకాక పక్కనే ఉన్న  అంగన్వాడి కేంద్రాన్ని  కూడా సందర్శించారు

Related Posts