రోడ్డు భద్రత క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి
హైదరాబాద్ జనవరి 2
రోడ్డు భద్రత పై రూపొందించిన క్యాలెండర్, రవాణా శాఖ డైరీ లను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ఖైరతాబాదు రవాణా కార్యాలయంలో శాఖ అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత పై రూపొందించిన నూతన సంవత్సరం-2020 క్యాలెండర్, జనవరి-2020 సంచిక మరియు డైరీ ని మంత్రి ఆవిష్కరించారు. మంత్రికి సంస్థ అధికారులు, ఉద్యోగులు నోట్ పుస్తకాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి అధికారులకు, ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవాణా శాఖ, ఆర్టీసీ తనకు రెండు కళ్ళు లాంటివని అన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సందీప్ సుల్తానియా తదితరులు ఉన్నారు.