YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సారీ చెప్పిన జీవితా ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం : జీవితా

సారీ చెప్పిన జీవితా ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం : జీవితా

సారీ చెప్పిన జీవితా
ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం : జీవితా
హైద్రాబాద్, జనవరి 2 
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాబాస అయిన సంగతి తెలిసిందే. ‘మా’లో ఉన్న విభేదాలను ఈ వేదికపై మాట్లాడకూడదని మెగాస్టార్ చిరంజీవి చెప్పినప్పటికీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ అడ్డదిడ్డంగా మాట్లాడటంతో కార్యక్రమంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తాను వద్దన్నా రాజశేఖర్ వేదికపైకి వచ్చి పరుచూరి గోపాలకృష్ణ వద్ద నుంచి మైక్ లాక్కొని అలా మాట్లాడారంటే మాలాంటి పెద్దలకు ఆయన ఇస్తున్న గౌరవం ఏంటని చిరంజీవి మండిపడ్డారు. ఇష్టంలేకపోతే కార్యక్రమానికి రావడం మానేయాలని ఘాటుగానే స్పందించారు. అంతేకాకుండా, రాజశేఖర్‌పై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవాలని ప్రెసిడెంట్‌ను నరేష్‌కు సూచించారు.అయితే, తన భర్త చేసిన పొరపాటుకు జీవితా రాజశేఖర్ క్షమాపణ చెప్పారు. ‘‘మీ అందరికీ తెలుసు రాజశేఖర్ పసి పిల్లాడి కన్నా ఎక్కువ. ఒక భార్యగా 26 ఏళ్లుగా ఆయనతో కలిసి నేను జీవిస్తున్నాను. మనసులో ఏముందో చెప్పడం తప్ప దాచుకోవడం ఆయనకు తెలీదు. ఇక్కడ ఆయన వల్ల కలిగిన ఇబ్బందికి నేను క్షమాపణలు చెబుతున్నాను. ఇది మిమ్మల్ని అగౌరవపరిచినట్టు కాదు. మీ మీద మాకు చాలా గౌరవం ఉంది’’ అని చిరంజీవిని ఉద్దేశించి జీవిత మాట్లాడారు.ఏదేమైనా ‘మా’లో కొన్ని సమస్యలు ఉన్నాయని జీవిత మాట్లాడుతూ అన్నారు. ‘మా’లో ఉన్న సమస్యలను దాయలేమని, అయితే.. చిరంజీవి గారు చెప్పినట్టు వాటిని ఆరుబయట పెట్టకుండా లోపలే పరిష్కరించుకుంటామని జీవిత చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన సంఘంగా ‘మా’ను తీర్చిదిద్దడమే తమ కర్తవ్యమని, ఈ కర్తవ్యంతోనే తాను, రాజశేఖర్ దీనిలోకి అడుగుపెట్టామని వెల్లడించారు. ‘మా’లో ఉన్న విభేదాల గురించి మాట్లాడదామని, పరిష్కరించుకుందామని చిరంజీవిగారు ఇప్పటికే చెప్పారని తెలిపారు. నరేష్‌తో కలిసికట్టుగా పనిచేసి అసోసియేషన్‌ను ముందుకు తీసుకెళ్తామని మోహన్ బాబు, చిరంజీవి, మురళీ మోహన్, కృష్ణంరాజుల సమక్షంలో జీవిత హామీ ఇచ్చారు.

Related Posts