60 వేల కోసం ఫ్యామిలీ హతం
లక్నో, జనవరి 2,
వలం రూ.60వేల అప్పు తీసుకుని తిరిగివ్వడం లేదన్న కక్షతో ఓ వ్యక్తి మొత్తం కుటుంబాన్నే నాశనం చేశాడు. భార్యభర్తలతో పాటు వారి ఇద్దరి పిల్లలను కిరాతకంగా ప్రాణం తీశాడు. ఈ దారుణ ఘటన హర్యానాలోని పానిపట్‌లో చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామ్లి పట్టణానికి చెందిన అజయ్ పథాక్ అనే వ్యక్తి భార్య స్నేహ, కుమార్తె వసుంధర(16), కుమారుడు భగవద్(14)తో కలిసి నివాసముంటున్నాడు.రెండ్రోజుల క్రితం భగవద్ హర్యానాలోని పానిపట్ శవమై కనిపించాడు. ఆ మరుసటిరోజే అతడి తల్లిదండ్రులు, అక్క ఇంట్లోనే విగతజీవులుగా పడి ఉన్నారు. వారిని పదునైన కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిమాన్ష్ అనే వ్యక్తి వారందరినీ చంపినట్లు తేలడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అజయ్‌కి తాను గతంలో రూ.60వేలు అప్పు ఇచ్చానని, ఆ మొత్తాన్ని తిరిగివ్వకుండా వేధిస్తున్నందునే అందరినీ చంపేసినట్లు అతడు అంగీకరించాడు.సోమవారం అజయ్ ఇంటికి వెళ్లి హిమాన్ష్ ఆ కుటుంబంతో కలిసి భోజనం చేశాడు. తనవద్ద తీసుకున్న రూ.60వేలు తిరిగివ్వాలని అజయ్‌ని కోరాడు. అయితే ఇప్పుడు తన దగ్గర అంత డబ్బు లేదని అజయ్ చెప్పాడు. దీంతో కోపం పెంచుకున్న అతడు రాత్రికి అక్కడే పడుకుని ఉదయం ఇంటికి వెళ్తానని వారిని కోరాడు. అజయ్ సరేనని చెప్పి ఓ రూమ్‌లో అతడికి బస చేశాడు. అర్ధరాత్రి వేళ నిద్రలేచిన హిమాన్స్ ముందుగా అజయ్, అతడి భార్య స్నేహ గొంతు కోసేశాడు. అనంతరం వసుంధర గదిలోకి వెళ్లి ఆమెను హత్యచేశాడు. భగవధ్‌ను చంపేసి హర్యానాలోని పానిపట్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు. మిగిలిన శవాలను కూడా అక్కడికి తీసుకొచ్చి పూడ్చేయాలని అనుకున్నా.. అప్పటికే ఈ విషయం చుట్టుపక్కల వ్యాపించడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు’ అని షామ్లి ఎస్పీ వినీత్ జైశ్వాల్ తెలిపారు.