YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ ఇల్లు ఇన్ సైడర్ ట్రేడింగ్....యనమల

జగన్ ఇల్లు ఇన్ సైడర్ ట్రేడింగ్....యనమల

జగన్ ఇల్లు ఇన్ సైడర్ ట్రేడింగ్....యనమల
విజయవాడ, జనవరి 2, 
అమరావతిపై రాజకీయ రగడ కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ అధికార పార్టీ అంటుంటే.. విచారణకు సిద్ధమని ప్రతిపక్షం సై అంటోంది. అలాగే మూడు రాజధానుల అంశంపైనా నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలుకు మాజీ మంత్రి యనమల కౌంటర్ ఇచ్చారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఇన్‌సైడర్ ట్రేడింగ్ కంపెనీలకు చెందిన అంశమన్నారు మాజీ మంత్రి. తాడేపల్లిలో జగన్ ఇల్లు కూడా ఇన్‌సైడర్ ట్రేడింగ్ అవుతుందా అని ప్రశ్నించారు. ఇక 2013లో తన అల్లుడు భూములు కొంటె కూడా ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అమరావతి కేవలం రైతులకు సంబంధించిన అంశం కాదని గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో రాజకీయాలు, పరిపాలనను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు.రాజధాని కోసం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీకి ఏం అవగాహన ఉందో చెప్పాలన్నారు యనమల. ఆ కమిటీ నివేదిక ఇవ్వకుండానే జగన్ ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. రాజధానిపై కేబినెట్ సబ్ కమిటీ జీవోనే చెల్లదని చెప్పుకొచ్చారు. ఇక రాజధాని విషయంలో కేంద్రానికి సూచనలు చేసే అధికారం ఉంటుందని చెప్పుకొచ్చారు. రాజధాని అంశం విభజన చట్టంలో ఉందని.. శివరామకృష్ణన్ కమిటీ విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.టీడీపీ పాలనలో రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వచ్చాయని.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు మాజీ మంత్రి. ఏపీకి ఒక బ్రాండ్‌ క్రియేట్‌ చేశామని.. ఇప్పుడు పెట్టుబడులు రావడం లేదని విమర్శించారు. అభివృద్ధి జరగాలంటే సంపద ముఖ్యమని.. ఆ సంపదను సృష్టించడం కొత్త ప్రభుత్వం వల్ల కాలేదన్నారు. సంపద సృష్టించే సిటీ ఏపీలో లేదని.. రాజధాని తరలింపు వార్తలతో పెట్టుబడులు రావట్లేదని వ్యాఖ్యానించారు.. ఆదాయం లేకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు.విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని ఎవరు అడిగారని యనమల ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ నేతల్ని చూస్తే విశాఖ ప్రజలు భయపడుతున్నారన్నారు. ఫ్యాన్‌కి మూడు రెక్కలు ఉన్నట్లే.. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తారా అన్నారు. ఫ్యాన్‌ని చూసి జగన్‌కు 3 రాజధానుల కల వచ్చిందేమోనని చురకలంటించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ఎవరికీ అభ్యంతరాలు లేవని చెప్పుకొచ్చారు.

Related Posts