YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మతం ఆధారంగానే పాకిస్తాన్ ఏర్పాటు

మతం ఆధారంగానే పాకిస్తాన్ ఏర్పాటు

మతం ఆధారంగానే పాకిస్తాన్ ఏర్పాటు
బెంగళూర్, జనవరి 2,
మతం ఆధారంగానే పాకిస్తాన్‌ ఏర్పడింది అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కర్ణాటక టుమకూరులోని శ్రీ సిద్ధగంగ మఠంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. మతం ఆధారంగానే పాకిస్తాన్‌ ఏర్పడింది. అక్కడ మతపరమైన మైనార్టీలు హింసించబడుతున్నారు అని తెలిపారు. వేధింపులకు గురైన మైనార్టీలు శరణార్థులుగా భారత్‌కు వచ్చారు. కానీ కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు మాత్రం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడవు. భారత్‌లో ఉంటున్న శరణార్థులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీలు తీస్తుంది.ఇవాళ పార్లమెంట్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారందరికీ తాను ఒకటి చెప్పదల్చుకున్నాను. పాకిస్తాన్‌ చర్యలను అంతర్జాతీయ స్థాయిలో తెలియజేసేలాఆందోళనలు చేయండని చెప్పారు మోదీ. ఒక వేళ ఆందోళన చేయాలనుకుంటే.. గత 70 సంవత్సరాల్లో పాకిస్తాన్‌ చేసిన చర్యలకు వ్యతిరేకంగా మీ స్వరం పెంచాలని మోదీ సూచించారు.శ్రీసిద్ధగంగ మఠం నుంచి 2020 సంవత్సరాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నాను అని మోదీ తెలిపారు. శ్రీసిద్ధగంగ మఠం యొక్క పవిత్ర శక్తి దేశ ప్రజల జీవితాలను సుసంపన్నం చేయాలని కోరుకుంటున్నానను అని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలోని మూడో దశకంలోకి భారతదేశం కొత్త శక్తి మరియు నూతన శక్తితో ప్రవేశించిందన్నారు. గత దశకం ప్రారంభమైనప్పుడు దేశంలో ఎలాంటి వాతావరణం ఉందో మీకు గుర్తుండే ఉంటుందన్నారు. కానీ ఈ మూడో దశకం అంచనాలు, ఆకాంక్షలు బలమైన పునాదులతో ప్రారంభమయ్యాయని మోదీ స్పష్టం చేశారు.రెండు రోజుల పర్యటన నిమిత్తం బెంగళూరుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక సీఎం యెడియూరప్ప స్వాగతం పలికారు. కర్ణాటకలోని డీఆర్‌డీవోను మోదీ సందర్శించనున్నారు. పలు కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా టుమకూరులోని శ్రీసిద్ధగంగ మఠంను మోదీ సందర్శించారు.

Related Posts