కాలువలొకి దూకిన ప్రేమజంట
గుంటూరు జనవరి 2,
గుంటూరు జిల్లా మాచర్ల మండలం కంభంపాడు కుడి కాలువ లొకి దూకి ఒక
ప్రేమజంట ఆత్మహత్య యత్నం చేసింది. పసర్లపాడు గ్రామానికి చెందిన జండవత్ అనిత, కొప్పునూరు గ్రామానికి చెందిన కేతవత్ శివనాయక్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరు గురువారం ఉదయం పురుగుల మందు తాగి కలువలోకి దూకి ఆత్మహత్య కి ప్రయత్నించారు. అటు గా వెళ్తున్న స్థానికులు గమనించి కలువలోకి దూకి అనిత ని కాపాడారు. శివ నాయక్ మాత్రం గల్లంతు అయ్యాడు. అనిత ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు.