YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సందేశాత్మకమైన చిత్రమిది

Highlights

  • దండుపాల్యం 3 సినిమా రివ్యూ 
  • ఇండియన్ హిస్టరీలో  ఫస్టు టైం
  • దండుపాళ్యం సిరీస్ కు ఇది  ముగింపు 
సందేశాత్మకమైన చిత్రమిది

ఒక్కొక్క కళకు ఒక్కొక్క బౌతిక మాధ్యమం అవసరం సినిమాకి ఆకట్టుకొనే పాత్రలు,సన్నివేశాలు,కథా కథనాలు సజీవమైన ఆత్మ, వాస్తవికత ఇవి ఉంటేనే సినిమాకి ఆకృతి ఏర్పడుతుంది లేకపోతే దర్శకునిలో మానవ సృష్టిగా మాత్రమే ఉండిపోతుంది."నా వ్యూ దండుపాల్యం 3":నిన్న ఓ మిత్రుడు భయ్యా దండుపాల్యం 3 సినిమాకి మార్నింగ్ షో టికెట్స్ బుక్ చేసాను, లక్ష్మీకళ ధియేటర్ దగ్గర wait చేస్తుంటాను అని మెసేజ్ పెట్టాడు చేసేది ఏమిలేక uber book చేసాను.. దండుపాళ్యం సిరీస్ కు ఇది ముగింపని..ఇలాంటి కథలని తను Hate చేస్తానని , ఇలాంటి మృగాలు మన మధ్య చాలా ఉన్నాయని, వాటి నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఒక సందేశాన్ని దర్శకుడు సినిమా ద్వారా ఇవ్వడం కొసమెరుపు.సిల్వర్ స్క్రీన్ పై ఇండియన్ హిస్టరీ లో ఇంతవరకు ఎవరి ఊహ కందని అతి భయంకరమైన సన్నివేశాలు ఈ సినిమాలు ఉండడం ప్రతి ప్రేక్షకుడిని shocking చేస్తుందంటే మీరు నమ్మలేని నిజం.దర్శకుడు శ్రీనివాస్ రాజు sigmund freud psychology ని ఈ సినిమాకి అన్వయించనట్టు అర్థమవుతుంది. సైకిక్ కిల్లర్స్ అనువంశిక కథని, వాళ్ళ పరిస్థితుల్ని three డిమెన్షన్స్ of characters లో డిసైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.ఈ సినిమా ద్వారా సృజనాత్మక ప్రక్రియ నూతనర్థాన్ని సంతరించుకొంటుంది.క్రైమ్ సినిమా చరిత్రలో మనకు కనిపించే మార్మికథకు, అంతర్దృష్టికి,స్వప్న సదృశ్య శీలతకు మూలాన్ని విడమరిచి చెబుతుంది.

ఈ సినిమా చూసిన తరువాత నాకు ఒక్క విషయం బోధపడింది అదేంటంటే Bi-ssociative thinking అంటే "ద్విసంసర్గ చింతనం స్థూలంగా చెప్పాలంటే సృజనాత్మక ప్రక్రియలో ఆలోచన ఓకేమాటుగా రెండు స్థాయిల్లో జరుగు తుంది ఒకటి చేతన, రెండవది అచేతన.ఆ రెండు స్థాయిలని ఏకం చేయడం అది సృజనాత్మకత. సత్యాన్ని నగ్నంగా ఎవరైనా మనముందు నిలబెడితే మన మెందుకో భుజాలు తడుముకుంటాము,ఘోరాలను మనం తెరపై చూడలేము, ఈ సుదీర్ఘ మానవ జీవన స్రవంతిలో ఇలాంటి క్రూరమైన వ్యక్తుల మానసిక రోగాలకి అమాయకులు బలైందన్నది అర్థ సత్యం. ఈ మానవ చరిత్ర పుటలు కొంతమంది క్రూరుల రక్తంతో నిండిపోయింది.

ప్రాచ్య ఖండంలో టోమేర్లీన్ మానవ కపాలాలతో పిరమిడ్లు నిర్మిచాడు, పర్షియన్ రాజు కేంబసీస్ ఎంతో మందిని అంధులను చేసిన దుర్మార్గుడు. వీళ్లంతా మానసిక రోగులే ప్రఖ్యాత చిత్రకారుడు వాన్ గాగ్ తన చెవిని కోసి ఒక వేశ్యకి పంపిన విచిత్రమైన వ్యక్తి, హోమర్ విరచితమైన "ఇల్లియాడ్" లోని ajax తాను శత్రువులకు దూరమవుతున్నదన్న భ్రమలో గొర్రెల మందలను నరుకుతాడు, ఇది గతించిన చరిత్ర నడుస్తున్న చరిత్రలో అన్ని మానవ మృగాలే. సత్యాన్ని, నిజాయితీని, హేతుబద్దతను , ధర్మబద్ధతని ఈ రంగుల ప్రపంచం అంగీకరిస్తుందా ?ఇది నిరంతరం నా మస్తిష్కాన్ని తొలిచే ప్రశ్న ?సినిమా అంటే వాస్తవికత,వాస్తవికత తరిగి నప్పుడు కళ కలయే అవుతుంది.
బోటం లైన్..ఈ సినిమా గురుంచి ఆర్విజీ  ట్వీట్ చేయడమే కాకుండా నిన్న వాట్సాప్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తపరచడం కొసమెరుపు.
                                                                                         -  సూర్య ప్రకాష్, సినీ విశ్లేషకులు 

Related Posts