YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 చలో విశాఖ.. సచివాలయం తరలింపునకు ముహూర్తం ఫిక్స్.?

 చలో విశాఖ.. సచివాలయం తరలింపునకు ముహూర్తం ఫిక్స్.?

 చలో విశాఖ.. సచివాలయం తరలింపునకు ముహూర్తం ఫిక్స్.?
విశాఖపట్టణం, జనవరి 3
ఏపీకి మూడు రాజధాను ప్రకటనపై అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. రాజధాని తరలింపును తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని ఒకవైపు ఆందోళనలు కొనసాగుతుండగా మరోవైపు విశాఖపట్నంలో సచివాలయం ఏర్పాటుకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అతి త్వరలోనే సచివాలయాన్ని విశాఖకు తరలించాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం.సచివాలయం తరలింపునకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 6 వ తేదీలోగా సచివాలయ తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారన్న ప్రచారం నడుస్తోంది. ఈ మేరకు సచివాలయ తరలింపునకు సంబంధించి ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వచ్చే నెలలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇదిలా ఉంటే.. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనతో అమరావతి ప్రాంతంలో అలజడి రేగింది. రాజధాని కోసం తమ భూములు త్యాగం చేశామని.. ఇప్పుడు ఇక్కడి నుంచి రాజధానిని తరలించడం సరికాదని అమరావతి రైతులు ఆందోళలను కొనసాగిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా తీవ్రంగా తప్పుబడుతోంది. అయితే అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారురాజధాని అమరావతి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆ పార్టీ నేతలపై ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని అధికార వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఒక కులానికి లబ్ధి చేకూర్చేలా అమరావతిని రాజధానిగా ప్రకటించారని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బోస్టన్ గ్రూప్ నివేదిక.. హై పవర్ కమిటీ నివేదిక అనంతరం రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. కర్నూలులో హైకోర్టు, విశాఖలో సచివాలయం, అమరావతిలో అసెంబ్లీ ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Related Posts