YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికల్లో పోటీ చేయను  కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

ఎన్నికల్లో పోటీ చేయను  కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

ఎన్నికల్లో పోటీ చేయను 
కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే
కర్నూలు, జనవరి 3
కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వర్సె కార్యకర్తలు రాజకీయ రగడ జరిగింది. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ జూపాడు మండలం బన్నూరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. తమకు సమాచారం ఇవ్వకుండానే వచ్చారని కార్యకర్తలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగి గెలిపించామని.. కనీసం సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని కార్యకర్తలు నిలదీశారు.కార్యకర్తలు ఇచ్చిన ట్విస్ట్‌తో ఎమ్మెల్యే కాస్త నొచ్చుకున్నారు.. వారిపై మండిపడ్డారు. ఇంకోసారి ఓట్లు అడుక్కోను.. అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయనని ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు వచ్చినా, రాకున్నా.. వాళ్ల కాళ్లు పట్టుకోను అన్నారు. ఏదైనా ఊరికి పని కావాలంటే కార్యకర్తలే తన దగ్గరకు రావాలని.. తాను ఏదో చెయ్యాలని ఎమ్మెల్యేను అయ్యానని.. ఏదో అయ్యిందని.. ఇక చాలు అంటూ అసహనం వ్యక్తం చేశారు.ఆర్థర్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి బండి జయరాజు మీద 40వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంతేకాదు ఆయన గతంలో అసెంబ్లీలో చీఫ్ మార్షల్‌గా విధులు నిర్వహించారు. తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు.ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే కర్నూలు జిల్లాలోని కొడుమూరు నియోజకవర్గంలోనూ విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే సుధాకర్‌పై కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదంటూ బహిరంగంగానే నిరసనను తెలియజేయడం సంచలనం రేపింది. తాజాగా మళ్లీ నందికొట్కూరు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ మొదలయ్యింది.

Related Posts