సావిత్రి బాయ్ పూలే ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలి
కౌతాళం జనవరి 3,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కౌతాళం లొ హెచ్ ఎమ్ అద్వర్యం లో సావిత్రి భాయి పూలె జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి మహిళా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ముందుగా సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు అమె చేసిన త్యాగాలను, ఆమె చేసిన మంచి పనులను వివరించారు. జన్మదిన సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.శ్వేత అనే విద్యార్థినీ పూలే గురించి చక్కగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వరయ్య, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.