YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆస్తి-పాస్తులు ఆంధ్ర ప్రదేశ్

అందరికీ ఇళ్లు (కడప)

అందరికీ ఇళ్లు (కడప)

అందరికీ ఇళ్లు (కడప)
కడప, జనవరి 03 నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇంటి నిర్మాణం కోసం స్థల సాయం అందించినా.. బ్యాంకు ద్వారా రుణం సమకూర్చినా సొంతంగా ఇళ్లను కట్టుకోలేని నిరుపేదలకు ‘జట్టుగా ఇళ్ల నిర్మాణం’ (గ్రూప్‌ హౌసింగ్‌) అనే కొత్త పథకం తీసుకురానుంది. ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీ తర్వాత నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆయా మండలాల ఏఈల పర్యవేక్షణలో స్థానికంగా ఉన్న తాపీ మేస్త్రీలను కాంట్రాక్టర్లుగా గుర్తించి వారికి ఈ గ్రూప్‌ హౌసింగ్‌ బాధ్యతలను అప్పగించేందుకు ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈ కొత్తపథకం ద్వారా లబ్ధిచేకూరనుంది. పేదల ఇంటి కోసం స్థలాలు ఇచ్చినా.. రాయితీలు అందించినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతమంది ఇళ్లు కట్టుకోవడం లేదని ప్రభుత్వం గుర్తించింది. అవకాశాలు కల్పించినా గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు సొంతిళ్లను నిర్మించుకోలేదని ఒక అంచనాకు వచ్చింది. ఇళ్ల నిర్మాణంలో వారు కొన్ని నిర్వహణ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించింది. అలాంటి నిరుపేదలను ఎంపిక చేయాలని గృహనిర్మాణశాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. నిరుపేదలను గుర్తించిన తర్వాత సకల సౌకర్యాలు ప్రభుత్వమే అందించనుంది. ఆయా మండలాల గృహనిర్మాణశాఖ ఏఈల పర్యవేక్షణలో ‘జట్టుగా  ఇళ్ల కట్టుబడి’ కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ నిర్మాణం కోసం స్థానికంగా చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తాపీమేస్త్రీలకు కాంట్రాక్టర్లుగా అవకాశం కల్పిస్తారు. ఉగాది రోజున ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజున లబ్ధిదారుల్లో ఇళ్లు నిర్మించుకోలేని పేదలను బృందాలుగా గుర్తించనున్నారు. వెంటనే గృహనిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పిస్తారు. కట్టాల్సిన ఇళ్ల సంఖ్య ఆధారంగా అదే గ్రామంలో పనిచేస్తున్న తాపీమేస్త్రీలతో ఒప్పందం కుదుర్చుతారు. గ్రూప్‌ హౌసింగ్‌ బాధ్యతలు ఆయా మండలాల గృహనిర్మాణశాఖ సహాయక ఇంజినీరు పర్యవేక్షణలో నిర్మాణాలు చూస్తారు. నిర్మాణానికి అవసరమైన పరికరాలు, సామగ్రి కాంట్రాక్టర్లతో కొనుగోలు చేయిస్తారు. ఇందుకోసం వారి సామాజికవర్గ కార్పొరేషన్‌ల ద్వారా ఇంటికి రూ.3 లక్షల చొప్పున రాయితీ రుణాన్ని అందిస్తారు. బ్యాంకు నుంచి గ్రూప్‌ రుణం కింద మరో రూ.3 లక్షలు అందేలా చర్యలు తీసుకుంటారు. తయారీదారులతో మాట్లాడి ఇటుకలు, ఇసుక అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. నిర్మాణం పూర్తయ్యాక ఆ పరికరాలను తాపీమేస్త్రీ మరోచోట వినియోగించుకోవచ్ఛు దీనివల్ల స్థానికంగా కొంతమందికి ఉపాధి లభించడంతోపాటు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన ఇళ్లు కట్టుకునే వెసులుబాటు ఉంటుంది. మన జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 89,317 మంది లబ్ధిదారులు ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారాన్ని సేకరించారు. గ్రూప్‌ హౌసింగ్‌ కోసం పట్టణ ప్రాంతంలో 872 ఎకరాలు అందుబాటులో ఉండగా, ఇంకా 48 ఎకరాలకుపైగా భూమి సేకరించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 1,791 ఎకరాల భూమి అందుబాటులో ఉండగా మరో 152 ఎకరాలు అవసరం ఉంటుందని ప్రాథమిక నివేదికలో తేల్చారు.

Related Posts