YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజధాని ప్రాంతంలో సకల జనుల సమ్మె

రాజధాని ప్రాంతంలో సకల జనుల సమ్మె

రాజధాని ప్రాంతంలో సకల జనుల సమ్మె
అమరావతి 
రాజధాని రైతుల ఉద్యమం మలిదశకు చేరుకుంది.  సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చిన రాజధాని అమరావతి జేఏసీ, రాజధాని ప్రాంత పరిధిలోని 29 గ్రామాల్లో అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలను స్వచ్ఛందంగా నిలిపివేయనున్నట్లు  ప్రకటించింది. సచివాలయం, అసెంబ్లీ ఉద్యోగులు కూడా సకలజనుల సమ్మెకు సహకరించాలి. వాణిజ్య, వర్తక, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయకుండా  మాకు సహకరించాలి. 29 గ్రామాల సకల జనుల నిర్ణయం మేరకే సకల జనుల సమ్మే చేపడతున్నట్లు ఐకాస ప్రకటించింది. 16 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలని రైతులు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణానికి తాము సహకరిస్తాం. రైతులు ఇచ్చిన మిగులు భూములు అమ్మి రాజధానిని నిర్మించొచ్చు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే రైతులే జోలే పట్టు రాజధాని నిర్మాణానికి నిధులు సమికరిస్తామని అందోళనకారులు అంటున్నారు.

Related Posts