YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భావోద్వేగాలు కాదు.. వాస్తవాలను అర్థం చేసుకోవాలి  సీఏఏపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్

భావోద్వేగాలు కాదు.. వాస్తవాలను అర్థం చేసుకోవాలి  సీఏఏపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్

భావోద్వేగాలు కాదు.. వాస్తవాలను అర్థం చేసుకోవాలి
     సీఏఏపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్
హైదరాబాద్ జనవరి 3
: సీఏఏపై ప్రతిపక్ష నాయకులకు నాలెడ్జ్ లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. భావోద్వేగాల ఆధారంగా కాకుండా సీఏఏపై వాస్తవాలను అర్థం చేసుకోవాలని కోరారు. సీఏఏకు వ్యతిరేకంగా చేస్తోన్న ప్రదర్శనలు హింసాత్మకంగా మారటం బాధాకరమన్నారు. సీఏఏపై నిజానిజాలను ప్రజల ముందుంచేందుకు చర్చలు జరగాలని రాంమాధవ్ అభిప్రాయపడ్డారు. సీఏఏను వ్యతిరేకించే వాళ్ళకు.. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కారణం కూడా తెలియదన్నారు. సీఏఏపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుల బుర్రలోకి సమాచారం వెళ్ళటకపోవటం బాధాకరమన్నారు. సీఏఏ .. ఏ మతానికి, కులానికి, రంగుకు వ్యతిరేకం కాదని తెలిపారు. సీఏఏతో దేశంలో ఉన్న 130 కోట్ల ప్రజలకు సంబంధం లేదని... శరనార్థులకు మాత్రమే సంబంధించినదని స్పష్టం చేశారు. గతంలో చరిత్రాత్మక తప్పిదం జరిగిందని...మత ప్రాతిపాదికన దేశ విభజన జరిగిందని రాంమాధవ్ చెప్పుకొచ్చారు. 

Related Posts