స్వచ్ఛ సర్వేక్షన్ పై ర్యాలీ
తిరుపతి జనవరి 3,
స్వచ్ఛ సర్వేక్షన్ పై నగరంలో భారీ ఎత్తున మానవహారం మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ గిరీష ఆదేశాల మేరకు ఉదయం 9 గంటలకు స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి భారీ ఎత్తున 10 వేల మందితో కాలేజీ విద్యార్థులు విద్యార్థినులు పాల్గోన్నారు. నగరంలో ఉన్న మున్సిపల్ స్కూల్లో, ప్రభుత్వ స్కూళ్లు, ప్రైవేట్ స్కూలు, మరియు స్వచ్ఛంద సంస్థ వాళ్లు పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసారు. నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి వి వి మహల్ రోడ్డు, ఘంటసాల విగ్రహము, భవాని నగర్ కూడలి, తిరుమల తిరుపతి పరిపాలనా భవనం, కె టి రోడ్డు అన్నారావు సర్కిల్, కపిల్ తీర్థం నంది సర్కిల్ వరకు మానవహారం, ర్యాలీ నిర్వహించి,కమిషనర్ గిరీష ఈ మానవహారం, ర్యాలీని ప్రారంభం చడం, ర్యాలీలో పాల్గొని స్వచ్ఛ సర్వేక్షన్ 2020 పై ప్రతిజ్ఞ చేసారు. కమిషనర్ గిరీష మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ 2020 తిరుపతి ముందు వరసలలో నిలుపుటకు ఈ మానవ హారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వారితో పాటు అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌలేశ్వర రెడ్డి, నగరపాలక సంస్థ సూపర్డెంట్ ఇంజనీర్ ఉదయ్ కుమార్, మున్సిపల్ ఇంజనీర్ 1చంద్రశేఖర్ మున్సిపల్ ఇంజనీర్2 వెంకట్రామరెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, మేనేజర్ చిట్టిబాబు, శానిటరీ సూపర్వైజర్లు గోవర్ధన్, చెంచయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసులు ,షణ్ముగం, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు సెక్రటరీలు, కాలేజీ, స్కూల్, విద్యార్థి, విద్యార్థినులు, నగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు.