YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాజీనామా చేయకపోతే .. వీధుల్లో తిరగలేరు    కేరళ రాష్ట్ర గవర్నర్ కు కాంగ్రెస్ ఎంపీ వార్నింగ్

రాజీనామా చేయకపోతే .. వీధుల్లో తిరగలేరు    కేరళ రాష్ట్ర గవర్నర్ కు కాంగ్రెస్ ఎంపీ వార్నింగ్

రాజీనామా చేయకపోతే .. వీధుల్లో తిరగలేరు 
  కేరళ రాష్ట్ర గవర్నర్ కు కాంగ్రెస్ ఎంపీ వార్నింగ్
తిరువనంతపురం జనవరి 3
తాజాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం పౌరసత్వ సవరణ చట్టం పై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమం లో రాజీనామా చేయకపోతే .. వీధుల్లో తిరగలేరు అంటూ  కేరళ రాష్ట్ర గవర్నర్ కు కాంగ్రెస్ ఎంపీ వార్నింగ్ ఇచ్చారు. చాలా ప్రాంతాలలో ఈ ఆందోళనలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఈ ఆందోళనలల్లో కొంతమంది ప్రాణాలని కూడా కోల్పోయారు. కొంతమంది ఈ చట్టానికి మద్దతు తెలుపుతున్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మంది ఈ చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని తమ నిరసన తెలుపుతున్నారు. ఈ తరుణంలోనే తాజాగా కేరళలో కాంగ్రెస్ ఎంపీ ఒకరు ఈ పౌరసత్వ చట్టం విషయంలో ఏకంగా రాష్ట్ర గవర్నర్ కే వార్నింగ్ ఇచ్చారు. రాజీనామా చేయకపోతే .. వీధుల్లో తిరగలేరు అంటూ హెచ్చరించారు. పూర్తి వివరాలు చూస్తే .. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు ని రద్దు చేయాలంటూ కేరళ అసెంబ్లీ లో చేసిన తీర్మానం రాజ్యాంగ విరుద్ధమనీ.. అది చెల్లదని రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన ఎంపీ సాక్షాత్తూ గవర్నరునే హెచ్చరించారు. కోజికోడ్ నగరం లో పౌరసత్వ సవరణ చట్టం జాతీయ పౌర రిజిస్టరులకు వ్యతిరేకం గా ‘సేవ్ ద నేషన్’ పేరిట జరిగిన ర్యాలీ లో ఎంపీ మురళీధ రన్ మాట్లాడుతూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తన పదవికి రాజీనామా చేయకుంటే ఆయన కేరళ వీధుల్లో తిరగలేరని అన్నారు.పౌరసత్వ సవరణ చట్టం దేశ ప్రజలకు వ్యతిరేకమని దీనిపై తాము రెండో స్వతంత్ర పోరాటం చేయాలని ఎంపీ అన్నారు. ప్రజాస్వామ్యం న్యాయానికి ఈ పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకమని దీనిపై 140 మంది సభ్యుల కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని ఎంపీ తెలిపారు. అయితే ఈ తీర్మానానికి ఎలాంటి చట్టబద్ధత లేదు. పౌరసత్వం అనేది కేంద్ర పరిధిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి దానితో ఎటువంటి సంబంధం ఉండదు. కేరళకు సంబంధం లేని ఓ అంశంపై వీరంతా ఎందుకిలా చేస్తున్నట్టు అని గవర్నర్ ఆరిఫ్ పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళలో నిరసనలు చేస్తున్న వారిని ప్రశ్నించారు.

Related Posts