YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 అకాల వర్షంతో రైతులకు నష్టం 

 అకాల వర్షంతో రైతులకు నష్టం 

 అకాల వర్షంతో రైతులకు నష్టం 
నిర్మల్ జనవరి 3
గురువారం నుండి పడుతున్న వర్షానికి రైతులకు శాపంగా మారింది మార్కెట్ ఉన్న వరి దాన్యం తడువడంతో ఇబ్బంది పడుత్న్న రైతులు తడిసిన దాన్యాన్ని కొనుగ్లు చెయ్యాలని అధికారులకు రైతులు మోర పెట్టుకుంటున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడం, జన్నారం, పెంబి, దస్తూరాబాద్ మండలాలో వరి కోనుగోలు కేంద్రాలలోను పూర్తిగా కొనుగోలు చెయ్యలేదని వారు ఆరోపించారు. ఖానాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో అమ్మకానికి నిలువ ఉంచిన వారి ధాన్యం తడిసి ముద్దైంది. యార్డ్ నందు ధాన్యం నిలువచేసే ప్లాట్ ఫామ్ లు చెడిపోయి ఉన్నందున ధాన్యం పైన తాటి పత్రాలు కప్పి ఉన్నప్పటికీ వర్షపు నీరు చేరింది. ఇక యార్డు నుంచి  తాటి పత్రాలు సరి పడా ఇవ్వకపోవడం తో పెద్ద ఎత్తున ధాన్యం తడిసి ముద్దయింది. చిన్న చిన్న సాకులతో అధి కారులు ధాన్యం ను కొనుగోలు చేయకపోవడంతో యార్డులో ధాన్యం నిల్వలు పెరిగిపోయాయని పలువురు రైతులు ఆరోపించారు. దీంతో శుక్రవారం  సుమారు ఒక్క ఖానాపూర్ లో సుమారు 10  లారీ లోడ్ల వారి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అధికారులు వెంటనే స్పందించి ఇట్టి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts