వర్షానికి ముద్దయిన ధాన్యం
నాగర్ కర్నూలు జనవరి 3
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ లో వరిదాన్యం అకాల వర్షానికి తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట కళ్ళముందే వరద పాలు కావడం తో దిక్కుతోచని స్థితిలో రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. వివరాల్లోకి వెళ్తే పల్క పల్లి గ్రామానికి చెందిన రైతులు శ్రీను, ,బాలస్వామి పండించిన వరిపంట ను వ్యవసాయ మార్కెట్ కు తీసుకొని వచ్చి అరబోశారు. అకాల వర్షానికి వరి ధాన్యం కొట్టుకుపోగా మిగిలింది తడిసి పోయింది..ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ..కౌలుకు తీసుకుని పండించిన వరిపంట ఇలా వర్షానికి తడిసిపోయిదని..ధాన్యాని తడవకుండా ఉండే కవర్(పడాలు) లు సరిపడా ఉంటే ఇంత నష్టం వాటిల్లకుండ ఉండేదని వాపోయారు.