YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బిజెపి ద్వారానే మున్సిపాలిటీల్లో అభివృద్ధి సాధ్యం బిజేపీని గెలిపిస్తే కేంద్ర నిధులతో మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తాం భాజపా నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ

బిజెపి ద్వారానే మున్సిపాలిటీల్లో అభివృద్ధి సాధ్యం బిజేపీని గెలిపిస్తే కేంద్ర నిధులతో మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తాం భాజపా నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ

బిజెపి ద్వారానే మున్సిపాలిటీల్లో అభివృద్ధి సాధ్యం బిజేపీని గెలిపిస్తే కేంద్ర నిధులతో మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తాం
భాజపా నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ
వనపర్తి జనవరి 03
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో బిజెపి మునిసిపల్ ఎన్నికల సన్నాహ సభను నిర్వహించారు. ఈ సభలో భాజపా నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధిని చేయలేకపోయిందని కేవలం మాటలతోనే సరి పెడుతుందని, అభివృద్ధి అనేది భాజపా తోనే సాధ్యమవుతుందని, ఓటరు విజ్ఞతతో ఆలోచించి బిజెపిని గెలిపించినట్లయితే కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తామని అన్నారు.    దేశంలో నేడు కొన్ని రాజకీయ పార్టీలు సీయేయే పై మైనార్టీల లో అపోహలు కల్పిస్తున్నారని వీటిని కార్యకర్తలు ప్రజలకు వివరించి నివృత్తి చేయాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాజపా వనపర్తి జిల్లా అధ్యక్షులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, రాజ వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts