YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజధాని రైతుల ఆందోళనను బలవంతంగా భగ్నం పోలీసులు 

రాజధాని రైతుల ఆందోళనను బలవంతంగా భగ్నం పోలీసులు 

రాజధాని రైతుల ఆందోళనను బలవంతంగా భగ్నం పోలీసులు 
విజయవాడ జనవరి 3 
రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనను పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. మందడం గ్రామంలో పోలీసులు ఆందోళనకారుల పట్ల దారుణంగా వ్యవహరించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలను అరెస్టు చేశారు. మహిళా పోలీసులు రంగంలో దిగి ఆందోళన చేస్తున్న మహిళలను గోళ్ల తో రక్కి గిచ్చి వారిని ఎత్తి పోలీసు వ్యాన్ లలో వేశారు.దాంతో ఆగ్రహించిన గ్రామస్థులు తిరుగుబాటు చేసి మహిళలను తీసుకెళ్తున్న పోలీసు వ్యాన్ ను అడ్డగించారు. గ్రామస్తుల ఆందోళనతో వెనక్కి తగ్గిన పోలీసులు వ్యాన్ లో ఎక్కించిన వారిని కిందకు దింపారు. అదే విధంగా వెలగపూడి లో దీక్ష చేస్తున్న రైతులకు, మహిళలకు ఎంపి కేశినేని నాని, గల్లా అరుణ కుమారి, శ్రావణ్ కుమార్ సంఘీభావం‌ ప్రకటించారు.ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ ఆ రోజు మీరెంతో త్యాగాలు చేశారు… ఈరోజు పోరాటం చేస్తున్నారు మీకు పాదాభివందనం చేయాలి అని భావోద్వేగానికి గురయ్యారు. శివరామకృష్ణ కమిటీ అధ్యయనం చేసి రాజధాని ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది అని చెప్పారు తప్ప అమరావతిలో రాజధాని వద్దని చెప్పలేదని నాని అన్నారు. ఇష్టం వచ్చి విధంగా రాజధాని తీయడం, పెట్టడం చేసే హక్కు ఎవ్వరికీ లేదని ఆయన అన్నారు.రాష్ట్రానికి మధ్య లో ఈ ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారని, మీ అందరి త్యాగం కారణంగా చంద్రబాబు రూపాయి ఖర్చు చేయకుండా రాజధాని నిర్మాణం మొదలు పెట్టారని నాని అన్నారు. ప్రజా‌వేదిక కూల్చి అశుభంతో జగన్  పాలన ప్రారంభించారని ఏలిన నాటి శని అన్న చందంగా రాష్ట్రం లో నేడు పరిస్థితి తయారైందని నాని అన్నారు. ఎంత చెప్పినా‌ వినకుండా గెలిపించి కష్టాలు తెచ్చుకోవడం మనం చేసిన తప్పు అని నాని అన్నారు.

Related Posts