YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం    ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ 

చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం    ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ 

చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం 
      ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ 
హైదరాబాద్ జనవరి 3  
సీఎం కార్యాలయం రిటైర్డ్ ఉద్యోగుల అడ్డాగా మారిందని ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్  విమర్శించారు.డజనుకు పైగా రిటైర్డ్ ఐఏఎస్ లు అక్కడ విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.చీఫ్ సెక్రటరీ నియామక నిబంధనలకు విరుద్ధంగా సోమేశ్ కుమార్ నియామకం జరిగిందని అన్నారు. 15 మంది సీనియర్స్ ను కాదని సోమేష్ కుమార్ కు సిఎస్ పదవి కట్టబెట్టారన్నారు..సోమేష్ కుమార్ నియామకం ఓ క్విడ్ ప్రోకో .. టిఆర్ఎస్ కు  రాజకీయ లబ్ధి చేకూర్చారు కాబట్టే సీఎస్ పదవి సోమేష్ కుమార్ కు ఇచ్చారని ఆరోపించారు.జిహెచ్ఎంసి ఎన్నికల్లో సోమేశ్  కుమార్ టిఆర్ఎస్ కు అనుకూలంగా పని చేశారు కాబట్టే కేసీఆర్ ఆయనకి సిఎస్ పదవి కట్టబెట్టారని పేర్కొన్నారు.సోమేష్ కుమార్ ఆంధ్ర క్యాడర్ ఆఫీసర్ .. తెలంగాణ క్యాడర్ అధికారులను  కాదని ఆంధ్ర క్యాడర్ ఆఫీసర్ కు ఎలా సిఎస్ పదవి కట్టబెడతారని ప్రశ్నించారు.కెసిఆర్ తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ లకు  ప్రాధాన్యత కలిగిన పోస్టింగులు ఇవ్వడం లేదన్నారు.

Related Posts