YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జనవరి 10న కోర్టుకు రండి జగన్ కు సీబీఐ కోర్టు ఆదేశం

జనవరి 10న కోర్టుకు రండి జగన్ కు సీబీఐ కోర్టు ఆదేశం

జనవరి 10న కోర్టుకు రండి జగన్ కు సీబీఐ కోర్టు ఆదేశం
హైద్రాబాద్, జనవరి 3
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు సీఎం జగన్‌కు షాకిచ్చింది. కేసు విచారణ కోసం న్యాయస్థానానికి హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. ఈ నెల 10న కేసు విచారణకు జగన్ హాజరు కావాలని ఆయన తరఫు లాయర్లకు న్యాయస్థానం సూచించింది. జగన్‌తోపాటు.. ఈ కేసులో ఏ-2గా ఉన్న విజయసాయి రెడ్డి కూడా విచారణకు హాజరు కావాలని తెలిపింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జగన్ ఈ కేసులో విచారణకు హాజరు కావడం లేదు.పని ఒత్తిళ్లు, ప్రభుత్వానికి ఆర్థిక భారం దృష్ట్యా తనకు హాజరు నుంచి మినహాయింపు కల్పించాలని సీఎం జగన్ గతంలో సీబీఐ కోర్టును కోరారు. తాను కోర్టుకు హాజరైతే ప్రభుత్వానికి రూ.60 లక్షలు ఖర్చవుతయన్నారు. కానీ న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. నిందితుడు బలమైన వ్యక్తని.. ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ ఆరోపించింది. కాగా.. ప్రతి శుక్రవారం కేసు విచారణకు జగన్ హాజరయ్యే విషయంలో.. ఆయన తరఫు లాయర్లు రకరకాల కారణాలూ చూపిస్తూ పిటిషన్లు వేస్తున్నారు. దీంతో సీఎం అయ్యాక ఇప్పటి వరకూ ఆయన న్యాయస్థానం ఎదుట హాజరు కాలేదు. ఈ కేసులో దాదాపు 8 ఏళ్లుగా జగన్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసు కారణంగా ఆయన సుమారు 16 నెలలపాటు చర్లపల్లి జైల్లో ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నారు.

Related Posts