YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 గొంతు నులిమి.. కన్న తండ్రిని కడతేర్చిన కొడుకు!

 గొంతు నులిమి.. కన్న తండ్రిని కడతేర్చిన కొడుకు!

 గొంతు నులిమి.. కన్న తండ్రిని కడతేర్చిన కొడుకు!
హైద్రాబాద్, జనవరి 3, 
ఆస్తి కోసం జన్మనిచ్చిన తండ్రినే కడతేర్చాడు ఓ దుర్మార్గుడు. తాడుతో గొంతు నులిమి.. కొన ఊపిరితో ఉండగా పురుగుల మందు తాగించి హత్యచేసి, తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. అతడి మరణంపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు కొడుకును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా ఆస్తి కోసం తానే తన తండ్రిని హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఎన్కెపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్కెపల్లి గ్రామానికి చెందిన బొమ్మిడి బుచ్చిరెడ్డి (55)కి విక్రంరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ఇద్దరు కొడుకులు. బుచ్చిరెడ్డి తండ్రి చిన్న నారాయణరెడ్డి తమకున్న ఆస్తిలో మూడెకరాల భూమిని అదే గ్రామానికి చెందిన వారికి కొన్నేళ్ల క్రితం దానమిచ్చాడు. ప్రస్తుతం ఆ భూమి విలువ లక్షల రూపాయిలు పలుకుతోంది. ఈ నేపథ్యంలో బుచ్చిరెడ్డి కొడుకులు ఆ భూమి తమకే దక్కుతుందని కోర్టులో కేసు వేశారు. ఇలాంటి కుటుంబ తగాదాల నేపథ్యంలో రెండేళ్లుగా తండ్రిని సరిగా చూసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తమ తండ్రి భూమి సాగు చేసుకుంటున్న వారి దగ్గర డబ్బు తీసుకుని రాజీ పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పెద్ద కొడుకు విక్రంరెడ్డికి అనుమానం వచ్చింది. దీంతో తండ్రి బతికి ఉంటే ఆస్తి తమకు రాదని, ఆయన్ను చంపేయాలని పథకం పన్నాడు.తండ్రి హత్య పథకాన్ని.. విక్రంరెడ్డి తన తోడల్లుడైన వికారాబాద్‌ జిల్లా కొండాపూర్‌ గ్రామానికి చెందిన దామోదర్‌రెడ్డి, మామ నారాయణరెడ్డికి చెప్పి వారి సాయం కోరాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 27న వికారాబాద్‌ కోర్టులో కేసు విచారణ కోసం హాజరయ్యేందుకు బుచ్చిరెడ్డి రాగా, పథకం ప్రకారం దామోదర్‌రెడ్డి మద్యం తాగుదామని చెప్పి ఆయన్ను తన పొలం (తరిగోపుల గ్రామం) వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ కాపుగాసి ఉన్న విక్రంరెడ్డి.. తన తండ్రి మద్యం తాగి మత్తులోకి జారుకోగానే వెనుక నుంచి వచ్చి టవల్‌తో మెడకు చుట్టి బిగించాడు. తర్వాత దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పురుగుల మందు తాగించి హత్య చేశాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత గోధుమగూడకు చెందిన నవీన్‌రెడ్డిని రప్పించి టవేరా వాహనంలో మృతదేహాన్ని స్వగ్రామమైన ఎన్కెపల్లికి తరలించారు.తర్వాత దాయాదులైన గుండ్ల నర్సింహులు పొలం వద్ద మృతదేహాన్ని పడవేసి ఏమీ తెలియనట్లు ఇళ్లకు వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం అటుగా వెళ్లిన వారు బుచ్చిరెడ్డి మృతదేహాన్ని గమనించి కుటుంబ సభ్యులకు తెలపారు. దీంతో వారు వచ్చి మృతుడి నోరు, ముక్కు నుంచి రక్తం కారినట్లు ఉండటంతో ఎవరో హత్య చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఆస్తి కోసం తానే తండ్రిని హత్య చేసినట్లు విక్రంరెడ్డి నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో విక్రంరెడ్డి సహా అతడికి సహకరించిన ముగ్గురిని కూడా పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Related Posts