YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతిలో మహిళలపై దాడులు

అమరావతిలో మహిళలపై దాడులు

అమరావతిలో మహిళలపై దాడులు
విజయవాడ, జనవరి 3, 
అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 17వరోజు రాజధాని గ్రామాల్లో సకలజనుల సమ్మెను పాటిస్తున్నారు. దీక్షలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. రైతులు వినూత్నంగా వాహనాలు తుడుస్తూ.. పోలీసులకు పువ్వులు ఇస్తూ నిరసన తెలియజేశారు. రాజధాని పరిధిలో ఉన్న కృష్ణ, గుంటూరు జిల్లాల్లో టీడీపీ నేతలు రైతుల ఆందోళనలకు మద్దతు తెలియజేస్తున్నారు.మందడంలో మహిళలు చేస్తున్న నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీసింది. రోడ్డుపై బైఠాయించి నిరసనలు చేస్తున్న మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు.. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. మహిళలు వినకపోవడంతో పోలీసులు బలవంతంగా వారిని అక్కడి నుంచి లాక్కెళ్లారు.. ఈ క్రమంలో ఉద్రిక్తత ఏర్పడింది. మహిళల్ని వాహనాల్లో ఎక్కిస్తుండగా కొందరు అడ్డుపడ్డారు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మహిళలు పోలీసుల వాహనం ముందుకు వెళ్లకుండా అడ్డుగా రోడ్డుపై పడుకున్నారు.. కొంతమంది ఆ వాహనం టైర్ల కింద కూర్చున్నారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు.. వాహనాల్లో ఎక్కించిన మహిళల్ని కిందకు దించేయడంతో పరిస్థితి సద్ధుమణిగింది.ఇదిలా ఉంటే మందడంలో ఉద్రిక్తలపై గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు స్పందించారు. మందడంలో కొంతమంది మహిళలు బ్యాంక్ దగ్గరకి గుంపులుగా వెళ్లారని.. ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయడానికి మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారని.. పోలీసుల్ని రెచ్చగొట్టేలా మహిళలు ప్రవర్తించడంతో అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందన్నారు. హైకోర్టు, సచివాలయం ఉద్యోగుల ప్రయాణానికి చర్యలు ఉంటాయిన గతంలోనే హైకోర్టు ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు.లా అండర్ ఆర్డర్ తప్పకుండా పోలీస్ డిపార్ట్‌మెంట్ పనిచేస్తోందన్నారుమరోవైపు మందడంలో ఉద్రిక్తతలపై మాజీ మంత్రి లోకేష్ స్పందించారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై మీ ప్రతాపం చూపించడం దారుణం అన్నారు. ఇచ్చిన మాట పై నిలబడండి, మడమ తిప్పకండి అని అక్కాచెల్లెళ్ళు అడగటం తప్పా?. లాఠీలతో ఉద్యమాలను అణిచి వేయాలి అనుకున్న నియంతలు ఎక్కడ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పోలీసులు మహిళల గొంతు నొక్కి, ఈడ్చుకెళ్లే ఘటన జగన్ గారి నిరంకుశత్వ పాలనకు నిదర్శనం అన్నారు.

Related Posts