YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తమిళనాడు, బెంగళూర్ లలో కలపండి

తమిళనాడు, బెంగళూర్ లలో కలపండి

తమిళనాడు, బెంగళూర్ లలో కలపండి
తిరుపతి, జనవరి 3,
ఏపీకి మూడు రాజధానుల అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత వాసులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత అమర్‌నాథ్ రెడ్డి తాజాగా మరో ప్రతిపాదన చేశారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తిరుపతిని రాజధాని చేయాలన్నారు. అమరావతి నుంచి రాజధానిని మారిస్తే.. చిత్తూరు జిల్లాను తమిళనాడు లేదా కర్ణాటకలో కలపాలంటూ ఆయన సంచలన ప్రతిపాదన చేశారు.జగన్‌కు అధికారం కట్టబెట్టడం పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టయ్యిందన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు జగన్ నిద్రపోతున్నారా..? అని మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి ప్రశ్నించారు. పాలన వికేంద్రీకరణ చేస్తానని చెబుతున్న జగన్.. గతంలోనే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదన్నారు. జగన్‌‌కు పాలన వికేంద్రీకరణపై ఆలోచన, చిత్తశుద్ధి ఉంటే.. 2014లోనే ఈ ప్రతిపాదన చేయాల్సిందన్నారు. జగన్ 2014లో నిద్రపోయి ఇప్పుడు లేచారా? అని ఎద్దేవా చేశారు.చిత్తూరు జిల్లాను సగం తమిళనాడు, సగం కర్ణాటకలో కలపాలనే ప్రతిపాదనను రాష్ట్ర విభజన సమయంలోనే చేశానని అమర్‌నాథ్ రెడ్డి తెలిపారు. వైజాగ్‌ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటిస్తే.. ఈ ప్రాంత మేధావులంతా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తారని టీడీపీ నేత తెలిపారు.

Related Posts