YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 అపర భగీరధుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

 అపర భగీరధుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

 అపర భగీరధుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
  
రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల  జనవరి 03 
అపర భగీరధుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆన్నారు.  జిల్లాలోని వెల్గటూర్ మండలం శాఖాపూర్, కప్పారావు పేట గ్రామాలలో శుక్రవారం జరిగిన రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హజరై ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ  ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అపర భగీరథుడు అని, ఆయన దూరదృష్టితో తలపెట్టిన మంచి కార్యక్రమమే ఈ పల్లె ప్రగతి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. పల్లెల రూపురేఖలు మార్చాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమం స్పూర్తితో, జనవరి 2వ తేదీ నుండి ప్రారంభంకానున్న రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం అని పేర్కొన్నారు. పల్లె ప్రగతితో, గ్రామాలకు కొత్త రూపు వస్తుందని, గతంలో చేపట్టిన 30 రోజుల ప్రణాలిక లో భాగంగా అందరూ కలసి ఎలా పని చేశారో ఈ 10 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో కూడా అందరూ కలసికట్టుగా పని చేసి మన గ్రామాలను ఆదర్శంగా నిలుపుకుందామన్నారు. గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా మారుద్దామని, పల్లె ప్రగతి కార్యక్రమంతో సర్పంచ్ ల గౌరవం పెరిగిందన్నారు.పల్లెల రూపురేఖలు మారాయని, ఎన్నో ఏళ్ల తర్వాత పల్లెకు వచ్చిన వారు ఆశ్చర్యం కలిగేలా పల్లెల్లో మార్పు వచ్చాయని సూచించారు.  గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు ట్రీ గాడ్స్ ఏర్పాటు చేయాలని, ఏఒక్క గ్రామంలో చెత్త కనపడకుండా చేయడమే ఈ రెండవ విడత పల్లె ప్రగతి ప్రధాన అంశమన్నారు.ప్రతి గ్రామంలో డంప్ యార్డ్ లు, స్మశాన వాటికలు నిర్మాణం చేపట్టాలని, ప్రతి నెల ప్రతి గ్రామపంచాయతీ లకు 339 కోట్లు ప్రభుత్వం  విడుదల చేస్తున్నదన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని కొప్పుల ఈశ్వర్ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, కార్య కర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జడ్పీటిసి సుధారాణి ఎంపీపీ కూనమల్ల లక్ష్మి , సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, నాయకులు, కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts