Highlights
- కిటికీల నుంచి దూకేసిన ప్రజలు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
మాస్కోకు 3600 కిలోమీటర్ల దూరంలోని బొగ్గు ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచిన కెమెరోవోలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 37 మంది ప్రాణాలు కోల్పోగా 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మరో 70 మంది ఆచూకీ కనిపించడం లేదు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. షాపింగ్ మాల్ నిండా దట్టమైన నల్లని పొగలు కమ్మేయడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రష్యా కెమెరోవోలోని సైబీరియా సిటీలోని ఓ షాపింగ్‌మాల్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ మాల్‌లో సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు ఉండడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వందలాదిమందిని ఆ ప్రాంతం నుంచి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. చుట్టు ముడుతున్న అగ్ని కీలల నుంచి బయటపడేందుకు చాలామంది షాపింగ్ మాల్ గోడలు, కిటీల నుంచి దూకడం కనిపించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు.
37 killed in Russian mall blaze#Russia
— ANI Digital (@ani_digital) March 25, 2018
Read @ANI story | https://t.co/8kxYRQQ6TV pic.twitter.com/2huhalwGYc