YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రంగంలోకి సీకే బాబు భార్య లావణ్య

రంగంలోకి సీకే బాబు భార్య లావణ్య

రంగంలోకి సీకే బాబు భార్య లావణ్య
తిరుపతి, జనవరి 4, 
ఆయన ఒకప్పుడు రాజకీయ సంచలనానికి మారుపేరుగా నిలిచారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చోటే నేడు వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఎవరూ పట్టించుకునే వారు లేరు. పొమ్మనే వారే కాని రమ్మనే వారు లేరు. ఆయనే చిత్తూరు నేత సీకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు. అనుచరులు చిత్తూరు టైగర్ అని పిలచుకునేవారు. సీకే బాబుకు ఇప్పుడు రాజకీయంగాకానే కాదు వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాను శాసించిన చోటే అధికారుల నుంచి నోటీసులు అందుకోవాల్సిన పరిస్థిితి ఏర్పడింది.సీకే బాబు చిత్తూరు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ అభివృద్ధి బోర్డు ఛైర్మన్ గా కూడా పనిచేశారు. దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండటంతో చిత్తూరులో అడగుగడుగూ, ప్రతి మనిషీ ఆయనకు ఎరుకే. అయితే గత కొన్నేళ్లుగా ఆయనకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. సీకేబాబుకు అభిమానులతో పాటు శత్రువులు కూడా ఎక్కువే. అనేకసార్లు హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకున్నారు.అటువంటి సీకే బాబు దాదాపు అన్ని పార్టీలూ మారారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్లారు. అక్కడ ఉండలేక గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిపోయారు. బీజేపీ, టీడీపీ పొత్తు ఉంటుందనకున్న సీకే బాబు అప్పట్లో బీజేపీని ఎంచుకున్నారు. కానీ పొత్తు లేకపోవడంతో ఆయన తిరిగి టీడీపీలో చేరిపోయారు. టిక్కెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం తనకు అప్పగించిన నాలుగు నియోజకవర్గాల్లో పనిచేశారు. కానీ ఎక్కడా టీడీపీని గెలిపించలేకపోయారు. దీంతో టీడీపీ కూడా సీకే బాబును దూరం పెట్టేసింది. ఆయన కూడా ఆ పార్టీలో ఉండి చేయగలిగిందేమీ లేదన్న నిర్ణయానికి వచ్చారు.ఇక వైసీపీలో చేరడానికి దారులు మూసుకుపోయాయి. దీంతో సీకే బాబు తాను రాజీకీయాల నుంచి తప్పుకుని భార్య లావణ్యను పాలిటిక్స్ లోకి ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సీకే బాబు గత కొంత కాలంగా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. చిత్తూరు నగరంలో సీకేబాబు నిర్మిస్తున్న భవనానికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో సీకే బాబు అధికారులతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. ఇలా సీకే బాబు అన్ని రకాలుగా సతమనెతమవుతున్నారు. భార్య లావణ్యను రాజకీయాల్లోకి పైకి తెచ్చి తాను విరమించుకోవాలన్న యోచనలో సీకే బాబు ఉన్నట్లు తెలుస్తోంది. పాపం సీకే బాబుకు టైం కలసి రావడం లేదు.

Related Posts