YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నూజివీడులో టీడీపీ ర్యాలీ

నూజివీడులో టీడీపీ ర్యాలీ

నూజివీడులో టీడీపీ ర్యాలీ
నూజివీడు జనవరి 4, br /> కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మరియు వామపక్షాల ఆధ్వర్యంలో అమరావతిని కాపాడండి అంటూ పట్టణంలో భారీ ర్యాలీ, నియోజకవర్గం నుండి భారీగా పాల్గొన్న ప్రజలు అనంతరo  జాతిపిత మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గార్లకు వినతి పత్రం సమర్పించిన నేతలు,ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మీరు రాసిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అపహాస్యం అవుతుంది, చట్టాలు చట్టబందలవుతున్నాయి.ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న సంకుచిత నిర్ణయాలలో ప్రజలు రోడ్డున పడాల్సిన దుస్థితి తలెత్తింది.దేశంలో మూడు రాజధానులు అదే మాటను ఏనాడైనా విన్నామా రాజధాని తరలింపు గతంలో ఎక్కడైనా చూసామా స్వప్రయోజనాల కోసం ఏకంగా రాష్ట్ర రాజధానినే మార్ చేయాలని వైసిపి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఇలాంటి ఆలోచనలు విపరీత మనస్తత్వం ఉన్న శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి తప్పించి మరెవరికీ రావు. రాజధాని కోసం భూములు ఇవ్వడమే ఆ రైతులు చేసిన నేరమా, ప్రాణ సమానమైన భూమిని అమరావతి నిర్మాణం కోసం సంతోషంగా అందించడమే వారు చేసిన పాపమా, రాజధాని తరలించవద్దని 16 రోజులుగా కుటుంబాలతో సహా సహా రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు, రేయింబవళ్ళు అక్కడే ఉండి పసిబిడ్డల తో కలిసి పోరాడుతున్నారు మనకు మంచి రాజధాని నిర్మిస్తే అందరి జీవితాలు బాగుపడతాయని ఉద్దేశంతో భూములు ఇస్తే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిలువునా ముంచారు వారి ఆవేదన అర్థం చేసుకోకుండా అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారు, ప్రభుత్వం తీసుకున్న రాజధాని తరలింపు నిర్ణయాన్ని తట్టుకోలేక ఓ రైతు ఆవేదనతో మృతి చెందారు,ఇకనైనా ప్రజలతో చెలగాటమాడటం ఆపండి అమరావతి కోసం రాజధాని పరిరక్షణ సమితి తరపున పోరాడుతాం,ఈ క్రమంలో మా ప్రాణాలను సైతం లెక్కచేయo రాజధాని తరలింపు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకునేలా ఆయనకు మీరు మంచి బుద్ధి ప్రసాదించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అనంతరం నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మడమ తిప్పను,మెడ తిప్పను అనే ముఖ్యమంత్రి ఇప్పుడైనా రాజధాని తరలింపు ఆలోచన మానుకోవాలి లేదంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ధ్వజ మెత్తారు.

Related Posts