YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మందడంలో ఉద్రిక్త పరిస్థితి

మందడంలో ఉద్రిక్త పరిస్థితి

మందడంలో ఉద్రిక్త పరిస్థితి
అమరావతి జనవరి 4,
రాజధాని అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళన చేస్తున్న మహిళలపై నిన్న పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా బంద్కు పిలుపుని చ్చింది. దీంతో శనివారం ఉదయం నుంచి మందడంలో బంద్ కొనసాగింది.  మహిళలపై దౌర్జన్యానికి నిరసనగా రైతులు ఉదయాన్నే రహదారిపైకి చేరుకుని నిరసన చేపట్టారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకూడదని గ్రామస్థులు నిర్ణయించారు. గ్రామంలోని తమ దుకాణాల ముందు పోలీసులు కూర్చోడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పోలీసు వాహనాలను అడ్డుకుని తమ గ్రామం మీదుగా వెళ్లడానికి వీల్లేదని వెనక్కి పంపించారు. దీంతో పోలీసులు రైతులకు వాగ్వాదం జరిగింది. బంద్ కారణంగా మందడంలో దుకాణాలు మూతపడ్డాయి. రహదారిపైకి రైతులు భారీగా చేరుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. మీరు మాకు సహకరించాలంటే... మాకు సహకరించాలంటూ రైతులు, పోలీసులు పరస్పరం కాళ్లు పట్టుకుని వేడుకున్నారు.

Related Posts