YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

భూ ఆక్రమాలు నిజమే విశాఖపట్నం

భూ ఆక్రమాలు నిజమే విశాఖపట్నం

భూ ఆక్రమాలు నిజమే
విశాఖపట్నం  జనవరి 4 
విశాఖ నగరంలో భూ అక్రమాలు నిజమేనని సిట్ దర్యాప్తు బృందం నిర్ధారించింది. ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా అక్రమాలు చోటుచేసుకున్నాయని గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఎఎస్‌ అధికారి విజయకుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. శనివారం విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. భూ కేటాయింపులు,  ధ్రువీకరణ పత్రాల జారీలో నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, వీటితో పాటు భూ రికార్డులను కూడా తారుమారు చేశారని చెప్పారు. పరిశీలించిన ఫిర్యాదుల్లో గుర్తించిన అక్రమాల్లో అధికారుల పాత్రను ప్రభుత్వానికిచ్చే నివేదికలో ప్రస్తావిస్తామని చెప్పారు.మరికొద్ది రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామని,మార్చి నెలాఖరికి విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.తమ దృష్టికి వచ్చిన 2434 ఫిర్యాదుల్లో 1563 అర్జీలపై విచారణ చేపట్టామని చెప్పారు.

Related Posts