లూయిస్ బ్రెయిలి జయంతి వేడుకలు
హైదరాబాద్ జనవరి 4
వికలాంగుల , వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలి 211వ జన్మదిన వేడుకలు నల్గొండ క్రాస్ రోడ్డులోని లూయిస్ బ్రెయిలి పార్క్ లో ఘనంగా నిర్వహించారు. వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్ శైలజ లూయిస్ బ్రెయిలి విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసారు. ఆమె మాట్లాడుతూ అందత్వాన్ని జయించి, అంధులందరికి అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన మహానుభావుడు లూయిస్ బ్రెయిలి అని అన్నారు. ఈరోజు ఆరు చుక్కల బ్రెయిలి లిపీతో అంధులు విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, సంగీత కళ కారులుగా అన్ని రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల శాఖ జనరల్ మేనేజర్ ప్రభంజన్ రావ్ , సీనియర్ న్యాయవాది చంద్ర సుప్రియ , చైర్మన్ గంగారాం పేడ్ , వికలాంగుల ప్రతినిధులు శ్రీశైలం , గోపాల్ పాల్గొన్నారు.