YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎం.ఎస్. రాజు  దర్శకత్వంలో ఎస్.పి.జె. క్రియేషన్స్ పతాకంపై ‘డర్టీ హరి’   

ఎం.ఎస్. రాజు  దర్శకత్వంలో ఎస్.పి.జె. క్రియేషన్స్ పతాకంపై ‘డర్టీ హరి’   

ఎం.ఎస్. రాజు  దర్శకత్వంలో
ఎస్.పి.జె. క్రియేషన్స్ పతాకంపై ‘డర్టీ హరి’   

శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన నిర్మాత ఎం.ఎస్.రాజు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఎంతో మంది హీరోలు , హీరోయిన్లు, టెక్నీషియన్లు  ఆయన చిత్రాలతో స్టార్స్ గా  ఎదిగారు. ఇప్పుడు కొంత గ్యాప్ తరువాత ఆయనే స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తూ తీస్తున్న  చిత్రం  "డర్టీ హరి".  ఎస్. పి. జి.  క్రియేషన్స్ పతాకం పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో, గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మిస్తున్న చిత్రంఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు  . ఈ చిత్రం ద్వారా  శ్రవణ్ రెడ్డి అనే ఒక హైదరాబాద్ అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తుండగా , రుహాని శర్మ , సిమ్రత్ కౌర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా "డర్టీ హరి" గురించి దర్శకుడు ఎం. ఎస్. రాజు  మాట్లాడుతూ-''బాలచందర్, పుట్టన్న కనగల్, భరతన్ వంటి దర్శకులు చేసిన కొన్ని ప్రయత్నాలు అప్పట్లో చాలా బోల్డ్ గా ఉన్నా బ్యూటిఫుల్ గా,  క్లాసికల్ గా ఉండేవి. అలాంటి వారి స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని నేను కూడా చాలా బోల్డ్ గాను, పొయెటిక్ గాను మలిచాను. ఇది ఆడియన్స్ కి నచ్చుతుందని  నమ్ముతున్నాను'' అన్నారు. 
చిత్ర సమర్పకులు గూడూరు శివరామకృష్ణ మాట్లాడుతూ '' ప్రస్తుతానికి కథాంశం గోప్యం గా ఉంచుతున్నాం. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తాం''అని తెలిపారు .
చిత్రనిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్  మాట్లాడుతూ  "డర్టీ హరి" కొంత బోల్డ్ ప్రయత్నం అయినా, ఎమోషన్స్  మరియు ఎంటర్టైన్మెంట్ పాళ్ళు ఏ మాత్రం మిస్ చేయలేదు.  శ్రవణ్ రెడ్డి ని హీరోగా పరిచయం చేస్తున్నాం. రిలీజ్ డేట్ ని త్వరలో ప్రకటిస్తాం'' అని తెలిపారు.  
రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ . ఇతర పాత్రలను పోషించారు. 
ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : భాస్కర్ ముదావత్, డీఓపీ :ఎం.ఎన్ .బాల్ రెడ్డి, ఎడిటర్ :జునైద్ సిద్ధిఖి, సమర్పణ: గూడూరు శివరామకృష్ణ , నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్  స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.  

Related Posts