YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రైతులు, మహిళలపై పోలీసుల దౌర్జన్యం హేయనీయం యునైటెడ్ బహుజన పోరాట సమితి జాతీయ కన్వీనర్ కరణం తిరుపతి నాయుడు

రైతులు, మహిళలపై పోలీసుల దౌర్జన్యం హేయనీయం యునైటెడ్ బహుజన పోరాట సమితి జాతీయ కన్వీనర్ కరణం తిరుపతి నాయుడు

రైతులు, మహిళలపై పోలీసుల దౌర్జన్యం హేయనీయం
యునైటెడ్ బహుజన పోరాట సమితి జాతీయ కన్వీనర్ కరణం తిరుపతి నాయుడు
హైదరాబాద్ జనవరి 4 
రాజధాని గ్రామాల్లో  రైతులు, మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణమని యునైటెడ్ బహుజన పోరాట సమితి జాతీయ కన్వీనర్ కరణం తిరుపతి నాయుడు పేర్కొన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు, మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నవాళ్లపై పోలీసు జులుం ప్రదర్శించడంపై ఆయన మండిపడ్డారు. తమకు అన్యాయం జరిగిందని శాంతియుతంగా ఆందోళనలు చేసీ వారిని బలవంతంగా అరెస్ట్ చేయడమే కాకుండా మహిళలంటు చూడకుండా విచక్షణా రహితంగా హింసించడం అమానుషమన్నారు. దీనిని బట్టి చూస్తే రాష్ట్రం లో పోలీసు పాలన సాగుతుందని స్పస్టమవు తుందన్నారు.అరెస్ట్ సందర్బంగా పోలీసులు ప్రదర్శించిన తీరు సభ్య ప్రపంచం సిగ్గుపడుతుందన్నారు. అహింసా మార్గంలో నిరసన తెలుపుతున్న వారిపై పోలీసుల దమన కాండ యావత్ రాష్ట్రాన్ని భయాందోళనలకు గురిచేసిందన్నారు.రాష్ట్రం లో ఏకపక్ష పాలన సాగుతుందని తిరుపతి నాయుడు ఆరోపించారు.ప్రస్తుతం రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విదించాలని తిరుపతి నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాజధాని గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఆయన కోరారు. రైతులు, మహిళల్లో నెలకొన్న ఆందోళనలు తొలగించే చర్యలు ప్రభుత్వం చేపట్టాలని, మహిళల పై అసభ్యంగా ప్రవర్తిచిన మహిళా పోలీసులపై చర్యలు తీసుకోవాలని  తిరుపతి నాయుడు డిమాండ్ చేశారు.

Related Posts