YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి దేశీయం

కేంద్ర ప్రభుత్వంచే  అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ 

కేంద్ర ప్రభుత్వంచే  అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ 

కేంద్ర ప్రభుత్వంచే  అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ 

భారత ప్రభుత్వము అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా NAPS 2020 లోపు 50 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఇండస్ట్రీలో  ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా  ప్రయత్నం చేస్తోంది . అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా రమారమి 25 వేల నుంచి 50 వేల మంది వరకు ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఒకసారి  ఇందులో రిజిస్టర్ చేసుకున్న నిరుద్యోగ యువతకు వారి ఇష్టం ప్రకారం ముందుగా మూడు నెలలపాటు బేసిక్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది.  తదుపరి ఆయా రంగాలలో ఉన్న పరిశ్రమలలో స్టైఫండ్ ద్వారా మూడు నెలలపాటు ఉపాధి అవకాశం కలుగజేస్తారు. ఈ మూడు నెలల సమయంలో ఉద్యోగం నచ్చినట్లయితే తదుపరి  ఆ పరిశ్రమలో ఉద్యోగ అవకాశం కలుగజేస్తారు.  రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు పరిశ్రమల శాఖ అనేక పరిశ్రమలతో అనుసంధానం చేస్తూ పై స్కీమును మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున నిర్వహించడానికి,  యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమలలో ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తోంది.   మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత కు ఈ సమాచారం అందించి వారితో రిజిస్టర్ చేయించగలరు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత లో ఉన్న యువతకు ఇది మంచి ఉపయోగకరం.

Related Posts