YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విద్య, వైద్యరంగాలకు ప్రధాన్యత

విద్య, వైద్యరంగాలకు ప్రధాన్యత

విద్య, వైద్యరంగాలకు ప్రధాన్యత
చిత్తూరు, జనవరి 4 
 విద్య,వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యత ఇస్తూ ఉందని చిత్తూరు నియోజక వర్గ శాసన సభ్యుడు ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా ప్రదాన వైద్యశాలలో చిత్తూరు నియోజకవర్గ శాసన సభ్యులు డా.వై.ఎస్.ఆర్.ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డులను లబ్దిదారులైన పెరియా స్వామి, అమ్ములు, విజయ, మంజుల కు పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన చిత్తూరు నియోజక వర్గ శాసన సభ్యులు మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్.ఆర్.రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చారని తెలిపారు. వైద్యం అనేది ప్రతి పేదవారికి  అవసరమని ఇందులో భాగంగానే డా.వై.ఎస్.ఆర్.ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతూ ఉందన్నారు. వెయ్యి రూపాయల పైన ఎంత ఖర్చు అయిన అర్హులైన లబ్దిదారులకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా  వర్తిస్తుందన్నారు. ఈ నెల 9 వ తేదీ చిత్తూరు పట్టణంలో అమ్మఒడి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రారంబించనున్నారని తెలిపారు. ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతూ ఉందని, గత ఆరు నెలల కాలంలో ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన గనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.  జిల్లా ప్రధాన వైద్యశాల సూపరిండెంట్ పాండురంగయ్య మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాదాన్యత ఇస్తున్నారని తెలిపారు. అపోలో వైద్యశాల డా. ఉమా మహేశ్వర్ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకం భారతదేశానికే తలమానికమైన పథకం అన్నారు. అర్హులైన వారందరికి ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేయడం జరుగుతూ ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య శ్రీ టీమ్ లీడర్ మురళి, ఆసుపత్రిలోని డాక్టర్ లు, ఆరోగ్య మిత్రలు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts