YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ మాటలు...నీటి మూటలు

కేసీఆర్ మాటలు...నీటి మూటలు

కేసీఆర్ మాటలు...నీటి మూటలు
భువనగిరి జనవరి 4 
పేద ప్రజలకు మంచినీరు కావలన్నా, ,డ్రైనేజీ సమస్యలను తీర్చాలన్నా, హస్పిటల్ కి పోవలన్నా ఆపదలో సాపదలో ఆదుకునే స్థానిక నాయకులను ఎన్నుకునే ఎన్నికలు ఇవి. అందుకే ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతులను గెలిపించాలని పిలుపునిచ్చారు ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  కేసీఆర్ రెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు అని అయన విమర్శించారు.యాదాద్రి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ .వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.  ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం ప్రజలతో ఉంటాను అని హామీ ఇచ్చారు. కేంద్రం నుండి నిధులు తీసుకు వచ్చి మున్సిపాలిటీ లను అభివృద్ధి చేస్తాను.రెండు సంవత్సరాలు గా మూసి ని ప్రక్షాళనం మాటలు నీళ్ల మూటలు మారాయి అని అన్నారు.మూసి ప్రక్షాళన కోసం ప్రధాని మోడీని నిధులు కేటాహించమని విజ్ఞప్తి  మూసి ప్రక్షాళన చేస్తాను అని హామీ ఇచ్చారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ ను లోటు బడ్జెట్ గా కేసీఆర్ మార్చారు అని ఎంపీ విమర్శించారు.   స్థానికంగా మంచి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు మంచిగా పనులు అవుతాయని  కోమటిరెడ్డి అన్నారు. 

Related Posts