YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పల్లె ప్రగతి అందరి బాధ్యత : కలెక్టర్

పల్లె ప్రగతి అందరి బాధ్యత : కలెక్టర్

పల్లె ప్రగతి అందరి బాధ్యత : కలెక్టర్
సిరిసిల్ల జనవరి 4 
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయడం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్  అన్నారు.రెండోవిడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మూడో రోజైన శనివారం   ఇల్లంతకుంట  మండలంలోని అనంతారం , రహీంఖాన్ పేట , ఇల్లంతకుంట గ్రామాలను      కలెక్టర్  సందర్శించారు. పల్లె ప్రగతి  కార్యక్రమం క్షేత్ర ప్రగతిని పరిశీలించారు . రహీంఖాన్ పేటలో డంపింగ్ యార్డు, వైకుంఠ దామం స్థలం వివాదం ఉన్న విషయం ప్రజలు కలెక్టర్  దృష్టికి వెంటనే పరిష్కరించాలని స్థానిక తహసిల్దార్ ను ఆదేశించారు . అలాగే ఇల్లంతకుంట మండల కేంద్రంలో వైకుంట ధామం లో పూర్తీ స్థాయిలో వసతులు కల్పించాలన్నారు .ఈ సందర్భంగా కలెక్టర్  మా ట్లాడుతూ.... మొదటి విడుత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం అయిన సందర్బంగా అదే స్పూర్తితో రెండవ విడుతను ముందుకు తీసుకువెళ్లాలని కలెక్టర్ పేర్కొన్నారు . గ్రామాలలో పచ్చదనం – పరిశుభ్రత ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం    ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే అక్కడ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, అందుకు ప్రతి ఒక్కరు భాద్యతగా మెదిలి గ్రామ పరిశుభ్రతకు పాటుపడాలని అన్నారు . ఇంట్లోని తడి, పోడి చెత్తను వేరు చేసి తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా ఉండాలంటే గ్రామమంలోని ప్రజలందరూ  గ్రామాభివృద్దిలో స్వచ్చందంగా పాల్గొనాలని అన్నారు . స్పష్టమైన లక్ష్యాలతో పచ్చదనం, పరిశుభ్రత పెంపుకోసం  దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు వెళ్ళాలని సూచించారు. పల్లె ప్రగతి లో చేపట్టిన పనులకుగాను విడుతల వారిగా నిధులు మంజూరు చేస్తున్నామని, ఇందుకు సంబంధించి ఖర్చుల వివరాలను పంచాయితీ సిబ్బందిని అడిగి తెలుసుకొనే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. ప్రతిసారి గ్రామం లో గ్రామ సభలు నిర్వహించి, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ప్రతి పనిని చర్చించాలని అన్నారు. గ్రామాభివృద్ది కొసం నిర్ణయాలు తీసుకునే ముందు చర్చ జరగాలన్నారు .  . రెండవ విడుత పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తి అయ్యేలోగా ప్రతి గ్రామం లో డంపింగ్ యార్డు, వైకుంఠ దామం తో పాటు ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పల్లెప్రగతిలో మహిళలు మరింత చొరవ తీసుకోవాలని సూ చించారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. రోడ్ల వెంట నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు కంచెలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Related Posts